నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ అడ్వాన్స్‌డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు తయారు చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ న్యూయార్క్ నుంచి లండన్‌కు కేవలం 90 నిమిషాల్లో ప్రయాణించగల విప్లవాత్మక సూపర్‌సోనిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌పై కసరత్తు చేస్తోంది. ఈ విమానంలో దాదాపు 5,500 కిలోమీటర్ల ప్రయాణాన్ని గంటన్నర సమయంలో పూర్తి చేయవచ్చు. అంటే ఇదెంత వేగంగా ప్రయాణిస్తుందో ఊహించుకోవచ్చు. X-59 అని పిలిచే ఈ సూపర్‌సోనిక్ జెట్‌ను ఒక ప్రత్యేక కారణం కోసం డిజైన్ చేశారు. సాధారణంగా సౌండ్ కంటే ఎక్కువ వేగంతో ఫ్లైట్ ఎగిరినప్పుడు చాలా పెద్ద సౌండ్ వినిపిస్తుంది. అది షాక్ వేవ్స్ బయటకు పంపిస్తుంది. అవి మనుషులకు సోనిక్ బూమ్‌గా వినిపిస్తాయి. భూమిపై నివసించే అన్ని జీవులపై ఈ వేవ్స్, లౌడ్ సౌండ్ ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఆ రేంజ్‌లో సౌండ్, షాక్ వేవ్స్ రాకుండా సున్నితమైన సోనిక్ థంప్ వచ్చేలా X-59ని డిజైన్ చేశారు. USలో 1973 నుంచి భూమిపై సూపర్‌సోనిక్ ప్రయాణంపై నిషేధాన్ని విధించగా.. దాన్ని ఎత్తివేయడానికి X-59 మార్గం సుగమం చేస్తుంది. X-59 అనేది నాసా క్వైట్ సూపర్‌సోనిక్ టెక్నాలజీ మిషన్‌లో భాగం. ఈ మిషన్ సూపర్‌సోనిక్ ప్యాసింజర్ ఎయిర్ ట్రావెల్ సాధ్యత, ప్రయోజనాలను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. కాలిఫోర్నియాలోని పామ్‌డేల్‌లోని స్కంక్ వర్క్స్ ఫెసిలిటీలో లాక్‌హీడ్ మార్టిన్ ఈ విమానాన్ని నిర్మిస్తోంది.
0 Comments