ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లకు సైబర్ నేరగాళ్ల నుంచి ముప్పు ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. అయితే తాజాగా మరో రిస్క్ యూజర్లను ప్రభావితం చేస్తోంది. ఆండ్రాయిడ్ 11, 12, 12L, 13, 14 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వెర్షన్లతో సహా వివిధ OSలలో అనేక భద్రతా సమస్యలు ఉన్నాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపింది. ఈ సమస్య పెద్ద సంఖ్యలో ఆండ్రాయిడ్ డివైజ్‌లను హ్యాకర్లకు ఈజీ టార్గెట్‌గా మార్చవచ్చని హెచ్చరించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేస్తున్న ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారం, ఆండ్రాయిడ్ OSలోని హై-రిస్క్ వల్నరబిలిటీలను హ్యాకర్లు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ను పొందడం, ఎలివేటెడ్ ప్రివిలేజెస్ గెయిన్ చేయడానికి సద్వినియోగం చేసుకోవచ్చు. టార్గెటెడ్ సిస్టమ్‌లో సర్వీస్ డేనియల్‌కు దారి తీయవచ్చు. "ఫ్రేమ్‌వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్‌లు, కెర్నల్ ఎల్‌టీఎస్, ఆర్మ్ కాంపోనెంట్లు, మీడియాటెక్ కాంపోనెంట్లు, క్వాల్‌కామ్ కాంపోనెంట్లు, క్వాల్‌కామ్ క్లోజ్డ్ సోర్స్ కాంపోనెంట్లలో లోపాల కారణంగా ఆండ్రాయిడ్‌లో ఈ సమస్యలు ఉన్నాయి." అని CERT-IN తెలిపింది. సైబర్ ఏజెన్సీ ఈ వల్నరబిలిటీలు రిస్క్ పెంచుతాయని హెచ్చరిస్తోంది. ఈ హై రిస్క్ వల్నరబిలిటీలను గూగుల్ కూడా గుర్తించింది. గత వారం విడుదల చేసిన గూగుల్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ బులెటిన్ ప్రకారం, భద్రతా సమస్యలు ఆండ్రాయిడ్ డివైజ్‌లను ప్రభావితం చేస్తున్నాయి. గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లందరికీ సెక్యూరిటీ అప్‌డేట్లను కూడా విడుదల చేస్తోంది. ఫోన్ సెట్టింగ్స్ యాప్‌లో డివైజ్ ఆండ్రాయిడ్ వెర్షన్ నంబర్, సెక్యూరిటీ అప్‌డేట్ లెవెల్, గూగుల్ ప్లే సిస్టమ్ లెవెల్‌ను కనుగొనవచ్చు. OS అప్‌డేట్లు అందుబాటులో ఉన్నప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి. ఇన్‌స్టాల్ చేసుకోగల అప్‌డేట్స్ కోసం కూడా మాన్యువల్‌గా చెక్ చేయవచ్చు. ఫోన్ ఏ ఆండ్రాయిడ్ వెర్షన్‌పై రన్ అవుతుందో చెక్ చేయడానికి ఫోన్ "సెట్టింగ్స్" యాప్‌ను ఓపెన్ చేసి "అబౌట్ ఫోన్"పై నొక్కాలి. "సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్" కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేస్తే "ఆండ్రాయిడ్ వెర్షన్," "ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్,", "బిల్డ్ నంబర్" ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. ఆండ్రాయిడ్ వర్షన్ ఏంటో అక్కడ తెలుసుకోవచ్చు. చాలా సిస్టమ్ అప్‌డేట్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతాయి. అప్‌డేట్ అందుబాటులో ఉందో లేదో చేక్ చేయడానికి డివైజ్ "సెట్టింగ్స్" యాప్‌ను ఓపెన్ చేయాలి. "సెక్యూరిటీ & ప్రైవసీ"> "సిస్టమ్ & అప్‌డేట్స్"పై క్లిక్ చేయాలి. సెక్యూరిటీ అప్‌డేట్‌ల కోసం, "సెక్యూరిటీ అప్‌డేట్"పై నొక్కాలి. గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్‌ల కోసం, "గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్"పై ట్యాప్ చేయాలి. ఆన్‌స్క్రీన్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ఆండ్రాయిడ్ అప్‌డేట్ షెడ్యూల్స్ డివైజ్, మ్యానుఫ్యాక్చరర్, మొబైల్ క్యారియర్‌ను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని మొబైల్స్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మొబైల్ సెట్టింగ్స్ > "సాఫ్ట్‌వేర్ అప్‌డేట్" సెక్షన్‌కు వెళ్తే సరిపోతుంది.
0 Comments