మోటోరోలా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. 165హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫుల్-హెచ్‌డీ ప్లస్ పీఓఎల్‌ఈడీ అంతర్గత డిస్‌ప్లేను గరిష్ట స్థాయి 1,200 నిట్‌లను కలిగి ఉంది. ఔటర్ స్క్రీన్ 1,056×1,066 పిక్సెల్‌ల రిజల్యూషన్, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 3.6-అంగుళాల పీఓఎల్‌ఈడీ ప్యానెల్‌ను కలిగి ఉంది. మోటోరోలా రెజర్ 40 అల్ట్రాలోని కవర్ ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. మోటోరోలా రెజర్ 40 అల్ట్రా 4ఎన్ఎమ్ క్వాల్‌కామ్న్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్‌ఓసీతో అడ్రెనో 730 జీపీయూ, 8జీబీ ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో వచ్చింది.. రెజర్ 40 అల్ట్రా మార్కెట్లో ఒకే 8జీబీ + 256జీబీ వేరియంట్‌లో అందిస్తోంది. ఈ ఫోన్ ప్రారంభంలో రూ. 89,999, ఇన్ఫినిట్ బ్లాక్, వివా మెజెంటా కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు అదనపు గ్లేసియర్ బ్లూ కలర్‌వేలో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో తక్కువ ధర రూ. 79,999కు కొనుగోలు చేయొచ్చు.. ఇక కెమెరా విషయానికొస్తే.. 12ఎంపీ ప్రైమరీ సెన్సార్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 13ఎంపీ సెన్సార్ ఉన్నాయి. 32ఎంపీ సెన్సార్‌తో కూడిన ఇన్నర్ డిస్‌ప్లేలో కెమెరా కూడా ఉంది. మోటోరోలా రెజర్ 40 అల్ట్రాలో 30డబ్ల్యూ వైర్డ్, 5డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3,800ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
0 Comments