Ad Code

సోనీ న్యూ ఎల్‌వైటీ-900 సెన్సర్ తో స్మార్ట్ ఫోన్లు !


స్మార్ట్ ఫోన్ల తయారీలో ఒప్పో, షియోమీ, వివో అగ్రశ్రేణి సంస్థలుగా నిలిచాయి. తాజాగా మార్కెట్లోకి ఆవిష్కరించనున్న కొత్త మోడల్ ఫోన్లలో ప్రయోగాత్మకంగా న్యూ కెమెరా హార్డ్‌వేర్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ మూడు సంస్థలూ త్వరలో మార్కెట్లో ఆవిష్కరించే ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో న్యూ సోనీ ఎల్‌వైటీ-900 సెన్సర్ కెమెరాలను వాడుతున్నట్లు సమాచారం. ఒప్పో ఫైండ్ ఎక్స్‌7 ప్రో, షియోమీ 14 ఆల్ట్రా, వివో ఎక్స్‌100 ప్రో+ ఫోన్లలో న్యూ సోనీ 1-అంగుళం సెన్సర్ కెమెరా వాడుతున్నట్లు తెలుస్తున్నది. వీటిల్లో సోనీ న్యూ ఎల్‌వైటీ-900 సెన్సర్ల తో మార్కెట్లోకి తొలుత ఒప్పో ఫైండ్ ఎక్స్ 7 ప్రో ఆవిష్కరిస్తున్నది. నూతన డ్యుయల్ కన్వర్షన్ గెయిన్ టెక్నాలజీతో సోనీ ల్వెతియా ఎల్‌వైటీ-900 సెన్సర్ రూపుదిద్దుకున్నది. డీసీజీ టెక్నాలజీ తక్కువ వెలుతురు గల ప్రాంతాల్లో ఇమేజ్ ఔట్‌పుట్ మెరుగు పడటంతోపాటు ఇమేజ్ నాయిస్ తగ్గిస్తుందని చెబుతున్నారు. షియోమీ, వివో, ఒప్పో ఆవిష్కరించే ప్రీమియం ఫోన్ల రేర్ కెమెరా మాడ్యూల్స్‌లో 1-అంగుళం సోనీ ల్వైతియా ఎల్విటీ-900 సెన్సర్ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే వినియోగిస్తున్న ఐఎంఎక్స్‌989 లెన్స్ కంటే ఆప్టిమైజ్డ్ వర్షన్‌గా ల్వైతియా ఎల్వీటీ -900 సెన్సర్ ఉంటుంది. ఈ లెన్స్ షియోమీ 12ఎస్ ఆల్ట్రా, షియోమీ 13 ప్రో, షియోమీ 13 ఆల్ట్రా, వివో ఎక్స్‌90 ప్రో, వివో ఎక్స్‌90 ప్రో+ హువావే మేట్ 60 ప్రో, షార్ప్ అక్వోస్ ఆర్‌8 ప్రో మోడల్ ఫోన్లలోనూ న్యూ సోనీ ఎల్‌వైటీ-900 (New Sony LYT-900) సెన్సర్ కెమెరా వస్తున్నట్లు తెలుస్తున్నది. ఇక త్వరలో ఆవిష్కరించనున్న రియల్‌మీ జీటీ5 ప్రో మోడల్ ఫోన్ సోనీ ల్వైతియా ఎల్విటీ 808 ప్రైమరీ సెన్సర్‌, ఓమ్నీ విజన్ ఓవీవో 08డీ10 సెకండరీ సెన్సర్‌, సోనీ ఐఎంఎక్స్ 890 టెలిఫోటో సెన్సర్ కలిగి ఉంటుంది. రియల్‌మీ జీటీ5 ప్రో మోడల్ ఫోన్‌లో వచ్చే ట్రిపుల్ కెమెరా సెటప్‌లో రెండు 50-మెగా పిక్సెల్‌, 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా వినియోగించారని సమాచారం. 

Post a Comment

0 Comments

Close Menu