డిసెంబర్ 7 న రియల్ మీ జీటీ 5 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేయనుంది. Realme GT 5 ప్రో స్మార్ట్‌ఫోన్ బుకింగ్‌లు ప్రారంభమైనట్లు కూడా సమాచారం. 6.7 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేతో లాంచ్ చేయబడుతుంది. కాబట్టి ఈ ఫోన్ డిస్‌ప్లే మెరుగైన స్క్రీన్ అనుభవాన్ని ఇస్తుంది. డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్, 1200 nits బ్రైట్‌నెస్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్‌ని కలిగి ఉంది. 50MP IMX966 ప్రైమరీ సెన్సార్ + IMX581 అల్ట్రావైడ్ లెన్స్ + IMX89 3x టెలిఫోటో సెన్సార్ (IMX890 3x టెలిఫోటో) ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ముఖ్యంగా, ఈ ఫోన్ 120x డిజిటల్ జూమ్‌కు మద్దతు ఇస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో లాంచ్ చేయబడుతుంది. కాబట్టి గేమింగ్ యాప్స్, వీడియో ఎడిటింగ్ యాప్స్ ఈ ఫోన్ లో ఎలాంటి ఆటంకం లేకుండా ఉపయోగించుకోవచ్చు. మరియు ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా, ఈ రియల్ మీ GT 5 ప్రో స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది.12GB/16GB RAM మరియు 256GB/512GB స్టోరేజ్ సపోర్ట్‌తో, రెండు వేరియంట్ లలో ఈ అద్భుతమైన రియల్ మీ GT 5 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయబడుతుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొన్ని నిమిషాల్లోనే ఛార్జ్ చేయవచ్చు. మరోవైపు, ఈ ఫోన్ ఒక రోజు పూర్తిగా బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుందని రియల్ మీ తెలియజేసింది. Wi-Fi 6, NFC, GPS, బ్లూటూత్ 5.2 వంటి కనెక్టివిటీ ఫీచర్‌లతో వస్తుంది.
0 Comments