దేశీయ మార్కెట్లోకి ఫైర్ బోట్ రాయల్ స్మార్ట్ వాచ్-4జీబీ మ్యూజిక్ స్టోరేజ్ పేరుతో మరొక స్మార్ట్ వాచ్ అడుగుపెట్ట బోతోంది. రాయల్ ఫీచర్స్ తో ఈ స్మార్ట్ వాచ్ వస్తోంది. ఫైర్ బోల్ట్ నుంచి విడుదలైన ఈ రాయల్ వాచ్ దాదాపుగా 5000 రూపాయల ప్రైజ్ మనీతో మార్కెట్లోకి విడుదల కాబోతోంది. వాస్తవానికి ఈ స్మార్ట్ వాచ్ ఈనెల 25వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది.. అంతేకాకుండా ఫైర్ బోల్ట్ కూడా అధికారికంగా వెబ్సైట్లో కూడా అందుకు సంబంధించి ఒక టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ యొక్క ప్రత్యేకతల విషయానికి వస్తే..466x466 హై రిజల్యూషన్ ను అందిస్తుంది. 1.43 అంగుళాల అమూల్ డిస్ప్లే తో కలదు.750 నిట్స్ పిక్ బ్రైట్నెస్ తో కూడా ఈ వాచ్ లభిస్తోంది.ఈ వాచ్ లో అద్భుతమైన కలర్స్ సైతం బ్రైట్నెస్లు మనం చూడవచ్చు. ఈ వాచ్ యొక్క డిజైన్ కూడా అద్భుతంగా కనిపిస్తోంది. ఫీచర్స్ విషయానికి వస్తే టచ్ కంట్రోల్ తో పాటు త్రి కంట్రోల్ బటన్స్ కూడా ఉంటాయి. అలాగే ఇందులో లగ్జరీ పుష్ బటన్ కూడా ఉంటుంది.380 mah బ్యాటరీ సామర్థ్యంతో కలదు. 300 స్పోర్ట్స్ మోడ్స్ కూడా కలవు. హెల్త్ సూట్ ,క్యాలిక్యులేటర్ ,ఫైండ్ మై మొబైల్ ఇతరత్రా ఫీచర్స్ కూడా కలవు. ఈ స్మార్ట్ వాచెస్ 5 కలర్లలో మాత్రమే లభిస్తుంది.
0 Comments