Ad Code

రెడ్‌మి వాచ్ 4, రెడ్‌మి బడ్స్ 5 ప్రో విడుదల !


షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి కొత్త రెడ్‌మి కె70 సిరీస్‌తో పాటు రెడ్‌మి వాచ్ 4, రెడ్‌మి బడ్స్ 5 ప్రో డివైజ్‌లను ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్‌వాచ్ ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే సపోర్ట్‌తో వస్తుంది. హైపర్‌ఓఎస్‌లో రన్ అవుతుంది. 150 కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. బడ్స్ 5 ప్రోలో 10ఎమ్ఎమ్ సిరామిక్-కోటెడ్ ట్వీటర్లు, 11ఎమ్ఎమ్ టైటానియం లేయర్‌తో కూడిన వూఫర్‌లు ఉన్నాయి. 52డీబీ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కలిగి ఉంది. ఈ కొత్త వాచ్ 4 బ్లాక్, సిల్వర్ స్నో వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. అంతేకాదు.. కలర్ రేంజ్‌లో మెటాలిక్, లెదర్ లేదా నైలాన్ స్ట్రాప్‌తో సహా విభిన్న స్ట్రాప్ ఆప్షన్లతో వస్తుంది. రెడ్‌మి బడ్స్ 5 ప్రో క్లియర్ స్నో వైట్, ఐస్ పోర్సిలైన్ బ్లూ, అబ్సిడియన్ బ్లాక్, బ్లాక్ వేరియంట్ మొత్తం 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. అంతేకాదు.. ఇ-స్పోర్ట్స్ వెర్షన్‌ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. కేస్ లోపలి భాగంలో ఆరెంజ్ కలర్ టోన్, ఇయర్‌బడ్ క్యాప్స్‌తో కనిపిస్తుంది. రెడ్‌మి వాచ్ 4 ధర సీఎన్‌వై 499 (దాదాపు రూ. 5,800), రెడ్‌మి బడ్స్ 5 ప్రో సీఎన్‌వై 399 (దాదాపు రూ. 4,700) వద్ద లిస్టు అయింది. ఈ రెండు ప్రొడక్టులు ప్రస్తుతం చైనాలో అధికారిక షావోమీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. రెడ్‌మి కొత్తగా లాంచ్ చేసిన స్మార్ట్‌వాచ్ 1.97-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 390 x 450 పిక్సెల్‌ల రిజల్యూషన్, 600 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశంతో వస్తుంది. రెడ్‌మి వాచ్ 4 షావోమీ కొత్త హైపర్ ఓఎస్‌పై రన్ అవుతుంది. రెడ్‌మి వాచ్ 4లో బ్లడ్ ఆక్సిజన్ ట్రాకర్‌తో పాటు యాక్సిలరేషన్, గైరో, జియోమాగ్నెటిక్, యాంబియంట్ లైట్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్‌లు ఉన్నాయి.150 కన్నా ఎక్కువ ముందే ఇన్‌స్టాల్ చేసిన స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ ధరించే వారికి శిక్షణ కోసం వాయిస్ కోచ్‌ని కూడా కలిగి ఉంది. రోజువారీ యాక్టివిటీ ట్రాకింగ్‌తో పాటు, రెడ్‌మి వాచ్ 4 మెన్‌స్ట్రువల్ సైకిల్ ట్రాకర్‌ను కలిగి ఉంది. స్ట్రెస్ మానిటరింగ్, బ్రీతింగ్ ట్రైనింగ్, స్లీప్ ట్రాకింగ్‌తో కూడా వస్తుంది. 470ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. సాధారణ మోడ్‌లో 20 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఫీచర్‌ను ఒకే ఛార్జ్‌పై ఆన్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 5ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఇందులో జీపీఎస్, గెలీలియో, గ్లోనాస్, బీడౌ, క్యూజెడ్‌ఎస్ఎస్, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీకి కూడా సపోర్టు ఇస్తుంది. ఈ డివైజ్ బరువు 31.5 గ్రాములు, 47.58ఎమ్ఎమ్ x 41.12ఎమ్ఎమ్ x 10.5ఎమ్ఎమ్ పరిమాణం ఉంటుంది. ఇన్-ఇయర్ రెడ్‌మి బడ్స్ 5 ప్రో ఇయర్‌ఫోన్‌లు 10ఎంఎం సిరామిక్-కోటెడ్ ట్వీటర్‌లు, 11ఎంఎం టైటానియం లేయర్‌తో కూడిన వూఫర్‌లతో డైనమిక్ డ్రైవర్‌లను కలిగి ఉన్నాయి. ఇయర్‌ఫోన్‌లు 5డీబీ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)ని అందిస్తాయి. 49ఎంఎస్ లో లెటన్సీతో వస్తాయి. మరోవైపు, 20ఎంఎస్ లెటెన్సీతో యూఎస్‌బీ-సి 2.4జీహెచ్‌జెడ్ ట్రాన్స్‌మిటర్‌తో అమర్చబడి ఉంటుంది. రెడ్‌మి బడ్స్ 5 ప్రో ఛార్జింగ్ కేస్‌తో సహా 38 గంటల వరకు కలిపి బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇయర్‌బడ్స్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తాయి. ఇందులో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్‌తో వస్తాయి. షావోమీ హెడ్‌సెట్ యాప్‌కు కూడా సపోర్టు చేస్తాయి.

Post a Comment

0 Comments

Close Menu