హువావే తన హువావే నోవా 11 ఎస్ఈ ఫోన్‌ను త్వరలో గ్లోబల్ మార్కెట్ లో ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది. స్నాప్‌డ్రాగన్ 680 ఎస్వోసీ చిప్‌సెట్ తో హువావే నోవా 11 ఎస్ఈ ఫోన్ వస్తోంది. హువావే నోవా, హువావే నోవా 11 ప్రో, హువావే నోవా 11 ఆల్ట్రా లతోపాటు హువావే నోవా 11 ఎస్ఈ కూడా ఆవిష్కరిస్తారు. హువావే నోవా 11 ఎస్ఈ ఫోన్ గత ఏప్రిల్‌లోనే చైనాలో ఆవిష్కరించారు. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుందని భావిస్తున్నారు.ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే చైనా మార్కెట్‌లో ఆవిష్కరించిన హువావే నోవా 11 ఎస్ఈఫోన్ 8 జీబీ ర్యామ్‌తోపాటు రెండు స్టోరేజీ ఆప్షన్లలో లభిస్తుంది. హువావే నోవా 11 ఎస్ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.23 వేలు (1,999 చైనా యువాన్లు), 8 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.25 వేలు (2,199 చైనా యువాన్లు) పలుకుతుందని తెలుస్తున్నది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 680 ఎల్‌టీఈ ఎస్వోసీ విత్ 2.4 గిగా హెర్ట్జ్ సీపీయూతో వస్తోంది. హువావే 11 నోవా ఎస్ఈ ఫోన్ హార్మోనీ ఓఎస్ 4 వర్షన్‌పై పని చేస్తుంది. 6.67 అంగుళాల ఫ్లాట్ ఓలెడ్ ప్యానెల్ విత్ ఫుల్ హెచ్‌డీ+ రిజొల్యూషన్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 90 హెర్జ్ రీఫ్రెష్ రేట్ పొందుతుంది. డ్యుయల్ సిమ్ ఆప్షన్ కలిగి ఉండటంతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్‌తో వస్తున్నది. 108 మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరాతోపాటు సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కూడా వస్తుంది. హువావే నోవా 11 ఎస్ఈ ఫోన్ 66 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ -సీ చార్జింగ్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
0 Comments