నోకియా తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పలు బేసిక్ ఫోన్లను ఇప్పటికే ఆవిష్కరించింది. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇదే క్రమంలో వినియోగదారులకు తన బ్రాండ్ ఉత్పత్తులను మరింత దగ్గర చేసేందుకు నోకియా మాతృ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ 'ఈజీ పే' విధానాన్ని తీసుకొచ్చింది. అందుకోసం హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ డీఎంఐ ఫైనాన్స్ సంస్థతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. దీని సాయంతో నోకియా ఫోన్లను వినియోగదారులకు మరింత దగ్గర చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్ ఫైనాన్సింగ్ సొల్యూషన్ ద్వారా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలను 25-30 శాతం మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు.ఈ ప్రత్యేక విధానం ప్రారంభం సందర్భంగా హెచ్ఎండీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ ఇండియా రవి కున్వర్ మాట్లాడుతూ ఈజీ పే ఆప్షన్ ద్వారా నోకియా స్మార్ట్‌ఫోన్‌లు సామాన్యులకు మరింత అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఇది మంచి ఫైనాన్సింగ్ ఆప్షన్ అని.. తాము దీనికోసం డీఎంఐ ఫైనాన్స్ తో భాగస్వామం కలిగి ఉన్నామని చెప్పారు. జీటీఎమ్, యాక్సెసరీస్ అండ్ అలయన్స్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో హెడ్ గౌతమ్ ధింగ్రా మాట్లాడుతూ నోకియా పరికరాలను సులభంగా కొనుగోలు చేయడానికి హెచ్‌ఎమ్‌డి ఈజీ పే ఉపయోగపడుతుందన్నారు. క్రెడిట్ స్కోర్ ఎక్కువ లేని వ్యక్తులు స్మార్ట్‌ఫోన్‌లను సులభమైన ఈఎంఐలతో కొనుగోలు చేసే అవకాశాలు ఈ ఫైనాన్సింగ్ విధానంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. దీని కోసం లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగించినట్లు చెప్పారు. దీంతో ఫైనాన్సింగ్ ప్రక్రియ చాలా సులభతరం అయ్యిందన్నారు. క్రెడిట్ సిస్టమ్ గురించి అవగాహన లేని కస్టమర్‌లకు కూడా వేగవంతమైన ఆమోదాన్ని అందించడంలో సహాయపడతాయని ఆయన వివరించారు. హెచ్ఎండీ ఈజీ పే ఫీచర్లు, ప్రయోజనాలు..ఇన్ స్టంట్ అండ్ పేపర్‌లెస్.. ఈ కొత్త ప్రోగ్రామ్ నిజంగా పేపర్‌లెస్. ఎండ్-టు-ఎండ్ పూర్తి కావడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది.విభిన్న కస్టమర్ బేస్.. ఇప్పటి వరకూ ఎప్పుడూ ఫైనాన్స్ తీసుకోని వారికి కూడా ఇది చాలా సులభంగా పని చేసిపెడుతుంది. తద్వారా కస్టమర్ బేస్ పరిధిని విస్తరిస్తుంది.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి మీ అర్హతను చెక్ చేస్తారు.వేగంగా నగదు.. లావాదేవీ జరిగిన 2 గంటలలోపు ఛానెల్ భాగస్వాములకు లోన్ మొత్తాలు పంపిణీ అవుతాయి. భాగస్వామి వర్కింగ్ క్యాపిటల్‌పై కనీస ప్రభావాన్ని నిర్ధారిస్తుంది.ఉత్తమ ఆఫర్‌లు.. వినియోగదారులకు ఎటువంటి హిడెన్ చార్జీలు లేకుండా వివిధ కాల వ్యవధి, డౌన్ పేమెంట్ ఆప్షన్‌లలో నో-కాస్ట్ ఈఎంఐలు, పారదర్శక ధరలను ఆస్వాదించవచ్చు. ఫోన్ ధరలో కేవలం 20శాతం మాత్రమే డౌన్ పేమెంట్ చేసి ఫోన్ తీసుకోవచ్చు. ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. హెచ్ఎండీ ఈజీ పే ప్రోగ్రామ్ ప్రారంభంలో నాలుగు నోకియా స్మార్ట్‌ఫోన్ మోడల్‌లను కవర్ చేస్తుంది. నోకియా జీ42(8జీబీ/256జీబీ), నోకియా సీ32, నోకియా సీ22, నోకియా సీ12 ప్రో ఫోన్లను ఈ కొత్త ఫైనాన్సింగ్ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.హెచ్ఎండీ సాఫ్ట్ లాక్ అనే సాఫ్ట్ వేర్ ను మీ ఫోన్ కొనుగోలు చేసి సమయంలో ఇన్ బిల్ట్ ఇన్ స్టాల్ అయి ఉంటుంది. మీరు ఒకవేళ ఈ స్కీమ్ కింద ఫోన్ తీసుకొని ఈఎంఐ కట్టకపోతే ఫోన్ రిమోట్ గా లాక్ అయిపోతుంది. పేమెంట్ పూర్తయ్యేంత వరకూ ఫోన్ మీరు ఉపయోగించలేరు.
0 Comments