యూట్యూబ్ యూజర్లు యాడ్ బ్లాకర్ల వినియోగాన్ని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. యూట్యూబ్ యాక్టివిటీ పై ఇటీవల ప్రవేశపెట్టిన పాలసీపై ట్విట్టర్‌లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇందులో యాడ్ బ్లాకర్‌లను ఉపయోగించే యూజర్లకు నోటిఫికేషన్‌లు పంపడం, ప్లాట్‌ఫారమ్‌లో వీడియోలను చూసేందుకు సాఫ్ట్‌వేర్‌ను నిలిపివేయమని యూజర్లను కోరింది. అనేక హెచ్చరికల తర్వాత, యూట్యూబ్ ఇప్పుడు పరిమితులను అమలు చేస్తోంది. ఇకపై వినియోగదారులను కేవలం 3 వీడియోలను మాత్రమే చూసేందుకు అనుమతిస్తోంది. అయితే, ఇది శాశ్వత నిషేధం కాదని గమనించడం ముఖ్యం. ట్విట్టర్‌లో యూట్యూబ్ వార్నింగ్ స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసిన వినియోగదారులు యాడ్ బ్లాకర్‌లను డిసేబుల్ చేయమని లేదా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాలని యూట్యూబ్ రిక్వెస్ట్ పంపుతోంది. ఎవరైతే ఈ పాలసీని పాటిస్తారో వారిని మాత్రమే ప్లాట్‌ఫారమ్ కంటెంట్‌కి తిరిగి యాక్సెస్ చేయగలరని చెబుతోంది. అయినప్పటికీ, వినియోగదారులు వారి యాడ్-బ్లాకర్లను నిలిపివేసిన తర్వాత కూడా యూట్యూబ్ యాడ్-బ్లాకర్ రిమూవ్ బ్యానర్‌లను డిస్‌ప్లే అవుతున్నాయని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితమే యూట్యూబ్ ఈ చర్యలపై యూజర్లను హెచ్చరించింది. తమ పాలసీలను ఉల్లంఘించిన వినియోగదారులను బ్లాక్ చేస్తామని ప్లాట్‌ఫారమ్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే యూట్యూబ్ మల్టీ నోటిఫికేషన్‌లను యూజర్లకు పంపడంతో పాటు యూజర్ వ్యూ సామర్థ్యాలను పరిమితం చేసే ముందు యాడ్ బ్లాకర్‌లను ఉపయోగించడం మానేయమని లేదా యూట్యూబ్ ప్రీమియంకు సబ్‌స్క్రయిబ్ చేయమని ప్రోత్సహిస్తుంది. యూట్యూబ్ ప్లేబ్యాక్‌ని నిలిపివేయడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తాం. యూట్యూబ్‌లో యాడ్స్ అనుమతించమని వీక్షకులు పదేపదే చేసిన అభ్యర్థనలను విస్మరిస్తే మాత్రమే ప్లేబ్యాక్‌ని నిలిపివేస్తాం. యాడ్ బ్లాకర్‌ని ఉపయోగిస్తున్నట్లు వీక్షకులు తప్పుగా ఫ్లాగ్ చేసినట్టు భావించిన సందర్భాల్లో, ప్రాంప్ట్‌లోని లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఈ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవచ్చునని యూట్యూబ్ ప్రతినిధి పేర్కొన్నారు. యూట్యూబ్‌లో యాడ్-ప్రీ కంటెంట్‌ను చూడాలనుకునే వినియోగదారులకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. అందులో తమ బ్రౌజర్‌లలో యాడ్-బ్లాకర్ ఎక్స్‌టెన్షన్లను నిలిపివేయవచ్చు లేదా యూట్యూబ్ ప్రీమియంను ఎంచుకోవచ్చు. ఆ తరువాతి ఆప్షన్ నెలవారీ రుసుముతో వస్తుంది. అందుకు వ్యక్తిగత యూజర్లు రూ. 129 చెల్లించాల్సి ఉంటుంది. ఫ్యామిలీ సబ్‌స్క్రిప్షన్ (ఐదుగురు సభ్యుల వరకు)కు రూ. 179 నుంచి ప్రారంభమవుతుంది. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు యాడ్స్ రెవిన్యూ అనేది కీలకం. అందుకే, యాడ్స్ యూజర్ల ద్వారా వారి ఆదాయం తగ్గకుండా చూసుకోవడంలో భాగంగా యూట్యూబ్ కొత్త వ్యూహాలను కొనసాగిస్తోంది.
0 Comments