Ad Code

చేతికి వాచ్​లా చుట్టుకునే ఫుల్​ ఫోల్డబుల్​ ఫోన్​ !


మోటోరోలా ఫుల్​ ఫ్లెక్సిబుల్​ ఫోన్​ కాన్సెప్ట్​ను ప్రవేశపెట్టింది. అందులో ఫోన్​ చేతికి వాచ్​లా చుట్టుకున్నట్లు చూపించింది. 6.9 అంగుళాల ఎల్​ఈడీ స్కీన్ ఉన్న ఫోన్​ను అన్నింటిలా సాధారణంగా వాడొచ్చని చూపించింది. ముందు వైపే కాకుండా వెనుకకు కూడా మడవవచ్చని తెలిపింది. టేబుల్​పై స్టాండ్​లా మడిచి ఫోన్​ వాడుకోవచ్చని పేర్కొంది. పెద్ద సైజు స్మార్ట్​ వాచ్​ల చేతికి పెట్టుకోవచ్చని కూడా చెప్పింది. అయితే ఈ ఫోన్​కు సంబంధించి మిగతా ఫీచర్లు, బ్యాటరీ కెపాసిటీ కోసం మోటోరోలా వెల్లడించలేదు. మరోవైపు, చేతికి వాచ్​లా పెట్టుకున్నప్పుడు ఫోన్​ జారిపడిపోయే అవకాశం ఉన్నట్లు పలువురు నెటిజన్లు అంటున్నారు. కానీ అత్యాధునిక టెక్నాలజీ వచ్చే ఫుల్​ ఫోల్డబుల్​ ఫోన్​ ప్రత్యేకంగా ఆకర్షిస్తుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో మార్కెట్​లో ఈ ఫోన్​ లాంఛ్​ అవుతుందో లేదో చూడాలని ఇంకొందరు అంటున్నారు. ఆర్టిఫీషియల్​ ఇంటిలిజెన్స్​ ఫీచర్​ను తమ కంపెనీ ఫోన్ల, ల్యాప్​ట్యాప్​లలో ప్రవేశపెట్టనునట్లు మోటోరోలా చెప్పింది. క్లౌడ్​లో మనకు కావాల్సిన డేటా వెతకడం వంటి పనులు చేసేందుకు వీలుగా ఆ ఫీచర్​ రూపొందించనున్నట్లు పేర్కొంది. మెరుగైన డాక్యుమెంట్ స్కానింగ్​ కోసం​ ఇటీవలే కొత్త ఫీచర్​ను ప్రారంభించినట్లు చెప్పింది.

Post a Comment

0 Comments

Close Menu