Ad Code

ఐటీలో తొలగని మాంద్యం ముప్పు !

రోనా తర్వాత పెరిగిన అధిక ధరల కట్టడికి ప్రపంచ కేంద్రీయ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచడంతో ముంచుకొచ్చిన ఆర్థిక మాంద్యం నుంచి బయట పడేందుకు కార్పొరేట్ దిగ్గజ సంస్థలు మెటా, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్ సహా పలు టెక్ సంస్థలు పొదుపు చర్యలు చేపట్టాయి. ఫలితంగా 2022 నుంచి మొదలైన ఉద్యోగుల ఉద్వాసన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా మైక్రోసాఫ్ట్ అనుబంధ లింక్డ్ఇన్  ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌, టాలెంట్‌, ఫైనాన్స్ తదితర విభాగాల్లో 668 మందిని తొలగిస్తామని ప్రకటించింది. రెండేండ్లలో రెవెన్యూ గ్రోత్ తగ్గిపోవడంతో మైక్రోసాఫ్ట్ మరోదఫా పొదుపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తున్నది. ఈ పరిస్థితి మైక్రోసాఫ్ట్‌ లింక్డ్ ఇన్‌కే పరిమితం కాలేదు. భారత్‌లో పేరొందిన ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్ అందుకు మినహాయింపు కాదు. తన సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బైజూస్ గతేడాది కాలంలో నాలుగైదు వేల మందిని తొలగించింది. ఐటీ సంస్థల్లో ఉద్యోగులకు ఉద్వాసన కొత్త కాదు.. ఆశ్చర్యం అంతకన్నా కాదు.. రెండేండ్లుగా ఐటీ, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్ సంస్థల్లో నిత్యం ఉద్యోగుల తొలగింపు కొనసాగుతున్నది. ఉద్యోగుల తొలగింపు గణాంకాలు వెల్లడించే వెబ్‌సైట్ `లే-ఆఫ్స్‌.ఎఫ్‌వైఐ` ప్రకారం గత రెండేండ్లో 2120 గ్లోబల్ టెక్ కంపెనీలు 404,962 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. గతేడాది 1061 సంస్థలు 1,64,769 మంది, 2023లో ఈ నెల 13వరకూ 1,059 కంపెనీలు 2,40,193 మంది ఉద్యోగులను తొలగించాయి. అంటే గంటకు 23 మంది.. రోజుకు సరాసరి 555 మంది నిపుణులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. గతేడాది మొదలైన లే-ఆఫ్స్ పరంపర.. ఈ ఏడాది జనవరిలో గరిష్ట స్థాయిని తాకింది. గత జనవరిలో అత్యధికంగా 89,554 మంది టెక్ నిపుణులు ఉద్వాసనలకు గురయ్యారు. గత జూన్‌లో 4,632 టెక్ నిపుణులు ఉద్యోగులు ఇండ్లకు పరిమితం అయ్యారు. ఈ ఏడాది రిటైల్ టెక్ రంగంలో 29,161 మంది, కన్జూమర్ రంగంలో 28,873 మంది ఉద్యోగాలు కోల్పోయారు. పలు గేఇమింగ్ సంస్థలు కూడా ఉద్యోగాల కుదింపునకు ప్రణాళికలు రూపొందించాయి. చిప్‌ల తయారీ సంస్థ క్వాల్‌కామ్ 1258 మంది ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. భారత్ లో బైజూస్‌తోపాటు 70కిపైగా స్టార్టప్‌లు 21 వేల మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. వాటిల్లో చార్జ్‌బీ, కార్స్‌24, ఓలా, లీడ్‌, ఓయో, మీ షో, ఎంపీఎల్‌, ఇన్నోవాకర్‌, అన్అకాడమీ, వేదాంతు ఉన్నాయి. క్విక్ గ్రాసరీ డెలివరీ సంస్థ `డుంజో` ఈ ఏడాది రెండు దఫాల్లో సుమారు 400 మందిని తొలగిస్తే.. బైజూస్ ప్రత్యర్థి గత జూలైలో 1500 మందికి ఇంటికి పంపేసింది.

Post a Comment

0 Comments

Close Menu