Ad Code

సైబర్ దాడుల్లో టాప్‌-5లో ఇండియా !


పాన్‌కు చెందిన ఐటీ సెక్యూరిటీ సంస్థ 'ట్రెండ్ మైక్రో' రూపొందించిన 'మిడ్-ఇయర్ సైబర్ సెక్యూరిటీ రిపోర్ట్'లో సైబర్ క్రైమ్స్ విషయంలో భారత్.. టాప్-5 లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మొదటి ఆరునెలల్లోనే సుమారు 90,945 మాల్వేర్ డిటెక్షన్లు జరిగినట్టు ఆ సంస్థ గుర్తించింది. అదేవిధంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ మాల్వేర్ డిటెక్షన్‌లలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో ఉంది. 2023 మొదటి ఆరునెలల్లో సుమారు 5,609 ఆన్‌లైన్ మాల్వేర్ బెదిరింపులు జరిగినట్టు రిపోర్ట్ పేర్కోంది. 2023లో అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక సైబర్ నేరాలు జరుగుతున్న దేశంగా ఇండియా రికార్డుకెక్కింది. ఈ ఏడాది ప్రధమార్థంలో ప్రభుత్వ రంగం సుమారు 18,862 మాల్వేర్ దాడులను ఎదుర్కొంటే, బ్యాంకింగ్ రంగం 15,514 మాల్వేర్ దాడులను ఎదుర్కొంది. వీటితోపాటు తయారీ రంగం, ఐటీ రంగాలు కూడా మాల్వేర్ ఎటాక్స్ బారినపడ్డాయి. ఇదిలాఉంటే 2023 ప్రధమార్థంలో ప్రపంచవ్యాప్తంగా 37 బిలియన్ల ఇ-మెయిల్ బెదిరింపులు, 46 బిలియన్ల స్కామ్ ఫైళ్లు నమోదయ్యాయి. మొత్తంగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 85 బిలియన్లకు పైగా సైబర్ నేరాలకు సంబంధించిన బెదిరింపులు గుర్తించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ర్యాన్సమ్‌వేర్ ఎటాక్స్‌ను ఎదుర్కొన్న రంగాల్లో బ్యాంకింగ్, రిటైల్, రవాణా రంగాలు టాప్-3 లో ఉన్నాయి. ఇకపోతే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మైక్రోసాఫ్ట్ రూపొందించిన 'డిజిటల్ డిఫెన్స్ రిపోర్ట్' ప్రకారం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సైబర్ దాడుల్లో భారత్ వాటా 13 శాతంగా ఉంది. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా టార్గెట్ చేస్తున్న దేశాల్లో మనదేశం ఐదవ స్థానంలో ఉంది. అంతేకాదు, మన అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రోజుకి వందకి పైగా సైబర్ దాడుల్ని ఎదుర్కొంటోందట. ఇటువంటి సైబర్ నేరాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలు కూడా తోడవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. మనదేశంలో కామన్‌గా జరుగుతున్న సైబర్ దాడుల విషయానికొస్తే ఫిషింగ్, ఐడెంటిటీ థెఫ్ట్, సైబర్ హరాస్‌మెంట్, మాల్వేర్ అటాక్స్, ర్యాన్సమ్‌వేర్ అటాక్స్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్, సైబర్ స్టాకింగ్, ప్రొహిబిటెడ్ కంటెంట్.. వంటివి ముందువరుసలో ఉన్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu