Ad Code

నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల


నోకియా - హెచ్ఎండీ గ్లోబల్‌ భాగస్వామ్యంతో గత నెలలో నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. విడుదల సమయంలో 6GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌కు వచ్చిన ఆదరణతో తాజాగా 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌ కొత్త వేరియంట్‌ ర్యామ్‌ను 16GB వరకు వర్చువల్‌గా పెంచుకొనే అవకాశం ఉందని వెల్లడించింది. 20000 రూపాయల్లోపు 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్నవారు.. ఈ నోకియా ఫోన్‌ను ప్రయత్నం చేయవచ్చు. నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌+ 256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.16,999గా ఉంది. ఈ ఫోన్‌ పింక్‌, గ్రే, పర్పల్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. నోకియా అధికారిక వెబ్‌సైట్‌ సహా ఇతర రిటైల్‌ దుకాణాల్లో లభిస్తుంది. లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై రూ.999 విలువైన బ్లూటూత్‌ హెడ్‌సెట్‌ ఉచితంగా పొందనున్నారు. 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 560 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్ బరువు 193.8g మరియు 8.5mm థిక్‌నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 480+ CPU మరియు అడెన్నో 619 GPU ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 13పై పనిచేస్తుంది. 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు 20W ఛార్జర్‌తో వస్తుంది. కెమెరా విభాగానికి సంబంధించి ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP +2MP +2MP కెమెరాలను కలిగి ఉంటుంది. అదే ముందువైపు 8MP కెమెరాను అమర్చారు. IP52 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. వైఫై, బ్లూటూత్‌ 5.1, హెడ్‌ఫోన్‌ జాక్‌, భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్‌ రీడర్‌ను కలిగి ఉంటుంది. నోకియా అధికారిక వెబ్‌సైట్‌ సహా ఇతర రిటైల్‌ దుకాణాల్లో ఈ ఫోన్‌ కొనుగోలుకు అందుబాటులో ఉందని సంస్థ వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu