Ad Code

చంద్రయాన్-3 ప్రాజెక్టు కథ ముగిసినట్లేనా?


చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుమోపిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు నిద్రాణస్థితిలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వాటిని మేలుకొల్పేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటివరకూ కూడా ఎలాంటి సిగ్నల్స్ రాలేదు. వాస్తవానికి సెప్టెంబర్‌ 22న చంద్రుడిపై సూర్యోదయం అయింది. కానీ ల్యాండర్‌, రోవర్‌లు నిద్రాణస్థితిలో నుంచి ఇంకా మేల్కొవడం లేదు. ఫలితం కనిపించడం లేదు. ఈ తరుణంలో ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌ కుమార్ చంద్రయాన్‌-3 ప్రాజెక్టుపై తన స్పందనను తెలియజేశారు. ల్యాండర్‌ విక్రమ్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌లు మేల్కొవడంపై ఇక ఆశలు కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌ ప్రతిష్టాత్మకంగా పంపిన చంద్రయాన్‌-3 ప్రాజెక్టు ఇక ముగిసిపోయినట్లేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu