హెచ్‌పీ మరో రెండు ప్రీమియం ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. పెవిలియన్ ప్లస్ సిరీస్‌లో హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 14, హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 16 పేర్లతో ఇవి మార్కెట్లోకి ప్రవేశించాయి. ఈ కొత్త ల్యాప్‌టాప్‌లు AMD రైజెన్ 7, 13వ జెన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్స్, IMAX-ఎన్‌హ్యాన్స్‌డ్ డిస్‌ప్లేలతో వస్తాయి. ఇవి స్కూల్ స్టూడెంట్స్ నుంచి ప్రొఫెషనల్స్ వరకు అందరి అవసరాలను తీర్చగలవు. ఎంటర్‌టైన్‌మెంట్, కంటెంట్ క్రియేషన్‌కు కూడా ఇవి సెట్ అవుతాయి. ఇలాంటి వర్గాల వారిని లక్ష్యంగా చేసుకొని కొత్త ప్రొడక్ట్స్ తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 16 పెద్ద స్క్రీన్‌తో వచ్చే పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నవారు HP పెవిలియన్ ప్లస్ 16ను కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.1,24,999. ఈ ల్యాప్‌టాప్ 16-అంగుళాల IPS డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 2560×1600 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. పెవిలియన్ ప్లస్ 16 ల్యాప్‌టాప్‌లో 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i7-13700H, ఇంటెల్ కోర్ i5-13500H ప్రాసెసర్ ఉంటాయి. NVIDIA GeForce RTX 3050 GPU, 6GB GDDR6 VRAM, B&O ట్యూన్డ్ డ్యుయల్ స్పీకర్స్ వంటి స్పెసిఫికేషన్లతో డివైజ్ వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 16 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 14 ధర రూ.91,999. ఈ ల్యాప్‌టాప్ 13వ జెన్ ఇంటెల్ కోర్ i7-1355U లేదా AMD రైజెన్ 7 7840H ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ 14-అంగుళాల ల్యాప్‌టాప్ 120Hz 2.8K స్క్రీన్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. దీంతో సన్ లైట్‌లో కూడా స్క్రీన్ ఎలాంటి అంతరాలు లేకుండా మంచి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. పెవిలియన్ ప్లస్ 14 ల్యాపీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 13 గంటల వరకు పని చేస్తుందని కంపెనీ తెలిపింది. డివైజ్‌లో Intel Xe గ్రాఫిక్స్ ఉంటాయి. 16GB DDR4 RAM, 1TB SSD స్టోరేజ్ దీని సొంతం. కనెక్టివిటీ పరంగా USB టైప్-సి పోర్ట్, 2 USB టైప్-A పోర్ట్‌లు, 1 HDMI 2.1 పోర్ట్‌లు ఉంటాయి. దీని బరువు 1.44 కిలోలు. ఈ డివైజ్ 17.5 మిమీ మందంతో ఉంటుంది.
0 Comments