హానర్ షేర్ చేసిన పోస్ట్ ప్రకారం హానర్ మ్యాజిక్ Vs 2, హానర్ వాచ్ 4 ప్రో అక్టోబర్ 12న చైనాలో లాంచ్ కానున్నాయి. కంపెనీ ప్రొడక్టుల గురించి గ్లోబల్ లాంచ్ గురించి మరిన్ని వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇటీవలి గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో మోడల్ నంబర్ తో కూడిన హానర్ హ్యాండ్‌సెట్, Magic Vs 2గా రానుంది. 16GB RAMతో Qualcomm Snapdragon 8+ Gen 1 SoCతో గుర్తించవచ్చు. గత 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లిస్టింగ్‌లో ఈ హానర్ ఫోన్ VCA-AN00 ఇదే మోడల్ నంబర్‌తో కనిపించింది. ఈ హానర్ ఫోల్డబుల్ ఫోన్ ఆండ్రాయిడ్ 13తో రావచ్చు. ఇమేజ్ మ్యాజిక్ Vs 2 ఫోన్ 50MP ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంటుందని సూచిస్తుంది. ఈ ఫోన్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో సెకండరీ 50MP సెన్సార్‌ను, హానర్ మ్యాజిక్ Vs వంటి 8MP 3x టెలిఫోటో కెమెరాను కూడా అందించవచ్చు. మ్యాజిక్ Vs 2 గత మోడల్ కన్నా సన్నగా తేలికగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది.
0 Comments