ఆదిత్య ఎల్-1 మిషన్ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఆదివారం కీలక అప్‌డేట్‌ను అందించింది. అంతరిక్ష నౌక సక్రమంగానే పని చేస్తుందని, సూర్యుడి వైపు దూసుకుపోతుందని పేర్కొంది. అయితే, సరైన మార్గంలో ఆదిత్య-ఎల్1ని ఉంచేందుకు కీలకమైన ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొంది. స్పెస్ క్రాఫ్ట్‌లోని ఇంజిన్లను 16 సెకన్ల పాటు మండించి ట్రాజెక్టరీ కరెక్షన్ మ్యాన్‌యూవర్ ను నిర్వహించినట్లు పేర్కొంది. ఈ నెల 6న దిద్దుబాటు కార్యక్రమం జరిగిందని, ఈ ప్రక్రియలో స్వల్ప మార్పులు చేసినట్లు పేర్కొంది. ఇలాంటి కరెక్షన్‌ను ఇస్రో చేపట్టడం ఇదే తొలిసారి సెప్టెంబర్ 19న చివరిసారిగా ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ మాన్యువర్‌ను పూర్తి చేసిన తర్వాత దాని ట్రాక్‌ను సరిచేయడానికి ఇది అవసరమని ఇస్రో పేర్కొంది. ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ చుట్టూ హాలో ఆర్బిట్ చొప్పించాల్సి వచ్చినట్లు ఇస్రో చెప్పింది. ట్రాజెక్టరీ కరెక్షన్ చేయడంతో ఆదిత్య-ఎల్1 అంతరిక్ష వాహక నౌక.. ఉద్దేశించిన మార్గంలో సాగుతోందనే విషయం నిర్ధారణకు వస్తుందని పేర్కొన్నారు. ఇంకొన్ని రోజుల్లో మాగ్నెటో మీటర్ మళ్లీ ఆన్ చేయనున్నట్లు వివరించింది. ఇదిలా ఉండగా.. ఆదిత్య-ఎల్1 మిషన్‌ను సెప్టెంబర్ 2న ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే.
0 Comments