మోటో E13 కొత్త కలర్ వేరియంట్‌ను మోటొరోలా విడుదల చేసింది. ఇప్పుడు ఛార్మింగ్ 'స్కై బ్లూ' కలర్‌లో ఫోన్ లభిస్తుంది.8GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మోటో E13 లైనప్‌లో ఇప్పటికే క్రీమీ వైట్, అరోరా గ్రీన్, కాస్మిక్ బ్లాక్ వంటి మూడు కలర్ వేరియంట్లు ఉన్నాయి. కంపెనీ కొత్తగా మోటో E13ని నాలుగో కలర్ ఆప్షన్‌లో అందిస్తూ, దీనిపై భారీ ఆఫర్లు సైతం ప్రకటించింది. ఈ వివరాలను మోటొరోలా, ఎక్స్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో షేర్ చేసుకుంది.మోటొరోలా మోటో E13ని ఈ ఫిబ్రవరిలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 2GB+64GB, 4GB+64GB అనే రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి వచ్చింది. ఆగస్టులో 8GB+128GB వేరియంట్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు కొత్త కలర్ వేరియంట్‌లో రిలీజ్ అయింది. మోటో E13 పండుగ ప్రత్యేక ధర రూ.6,749తో అందుబాటులో ఉంటుంది. ఈ డివైజ్ అసలు ధర రూ.8,999. ఈ డిస్కౌంట్‌లో బ్యాంక్ ఆఫర్లు కలిసి ఉన్నాయి. ఈ ఆఫర్లు లేకపోతే ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7,499కి ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ మోటొరోలా వెబ్‌సైట్, రిటైల్ అవుట్‌లెట్‌లలో కూడా అందుబాటులో ఉంది. కలర్ ఆప్షన్‌లు మినహా మోటో E13 స్పెసిఫికేషన్లు అలానే ఉంటాయి. మోటో E13లో 20:9 యాస్పెక్ట్ రేషియోలో, 6.5-అంగుళాల IPS LCD డిస్‌ప్లే ఉంది. వినియోగదారులకు అన్ని మల్టీమీడియా యాక్టివిటీస్‌లో ఇమ్మెర్సివ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఫోన్ Unisoc T606 ప్రాసెసర్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. మోటో E13 మెమరీ, స్టోరేజ్ విషయానికి వస్తే.. మూడు వేరియంట్‌లు 64GB స్టోరేజ్ 2GB RAM, 64GB స్టోరేజ్ 4GB RAM, 128GB స్టోరేజ్ 8GB RAM అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ 13MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇది షార్ప్, వైబ్రెంట్ ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. అయితే 5MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు అనువుగా ఉంటుంది. మోటో E13 ప్రత్యేకమైన ఫీచర్‌లలో ఒకటి స్ట్రాంగ్ 5,000mAh బ్యాటరీ. ఫోన్ 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మోటో E13 ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) అవుట్ ఆఫ్ ది బాక్స్‌పై రన్ అవుతుంది. ఇది విస్తృత శ్రేణి యాప్‌లు, ఫీచర్‌లకు యాక్సెస్‌తో పాటు యూజర్-ఫ్రెండ్లీ, అప్ టూ డేట్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
0 Comments