Ad Code

మినీ సైజ్ ఇ-స్కూటర్ !


హోండా అంతర్జాతీయ మార్కెట్‌లో సూట్‌కేస్-సైజ్ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. హోండా మోటోకంపాక్టో పేరుతో లాంఛ్ అయిన ఫోల్డబుల్ ఇ-స్కూటర్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 995 డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.82,000 వేలు ఉంటుంది. ప్రస్తుతం ట్రైల్స్ లో ఉన్న ఈ బుల్లి స్కూటర్ నవంబర్ నుంచి అందుబాటులోకి రానుంది. హోండా, అకురా ఆటోమొబైల్ డీలర్ల దగ్గర ఇ-స్కూటర్ కొనొచ్చు. ఇ-స్కూటర్‌ను కాలిఫోర్నియా, ఒహియోలోని కంపెనీ ఫ్యాక్టరీల్లో తయారు చేస్తున్నారు. ఇ-స్కూటర్ బరువు చాలా తక్కువ. కేవలం 19 కిలోలు మాత్రమే. ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేకుండా ఈ స్కూటర్‌ను ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు. ఈ స్కూటర్‌ను ఫోల్డ్ చేసినప్పుడు సైజ్ 28 అంగుళాలు. ఓపెన్ చేసినప్పుడు సైజ్ 38 అంగుళాలు ఉంటుందని అధికారులు తెలిపారు. హోండా మోటోకంపాక్టో ఇ-స్కూటర్‌లో 6.8Ah బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 19 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఫుల్ ఛార్జ్ చేయడానికి 3.5 గంటల సమయం పడుతుంది. హోండా మోటోకంపాక్టో ఇ-స్కూటర్‌ను గంటకు 24 కిలోమీటర్ల వేగంతో నడపవచ్చు.. ఇకపోతే ఈ స్కూటర్ ఫీచర్స్ విషయానికొస్తే..మెత్తని సీటు, సురక్షితమైన గ్రిప్ ఫుట్ పెగ్‌లు, ఆన్-బోర్డ్ స్టోరేజీ, ఛార్జ్ గేజ్, డిజిటల్ స్పీడోమీటర్ లాంటివి ఉన్నాయి. మొదట ఈ స్కూటర్ అమెరికాలో అందుబాటులోకి రానుంది. ఈ వాహనం ఇండియాలో అందుబాటులోకి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu