కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ అందుబాటులోకి రానున్నది. ఇందుకోసం రిలయన్స్ అనుబంధ జియో ఫ్లాట్‌ఫామ్స్, ప్రపంచ అగ్రశ్రేణి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ- ఎన్విదియా (యూఎస్)తో జత కట్టింది. రెండు సంస్థలు కలిసి భారత్‌లో అంతర్జాతీయ స్థాయి క్లౌడ్ బేస్డ్ కృత్రిమ మేధ (ఏఐ) కంప్యూటర్ మౌలిక వసతులను కల్పించడానికి ఎన్విదియాతో కలిసి పని చేస్తున్నట్లు జియో ప్లాట్ ఫామ్స్ శుక్రవారం ప్రకటించింది. 'రీసెర్చర్లు, డెవలపర్లు, స్టార్టప్‌లు, శాస్త్రవేత్తలు, ఏఐ ప్రాక్టీషనర్లు తదితరులకు హైస్పీడ్ సురక్షిత క్లౌడ్ నెట్‌వర్కింగ్‌ను న్యూ ఏఐ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి తెస్తుంది. ఇంధన పొదుపుతోపాటు సేఫ్టీగా వర్క్ లోడ్స్ నిర్వహించేందుకు దోహదపడతాయి` అని జియో ప్లాట్‌ఫామ్స్ తెలిపింది. దీని సాయంతో 45 కోట్ల మంది జియో మొబైల్ సబ్‌స్క్రైబర్లకు ఏఐ అప్లికేషన్లు, సర్వీసులు క్రియేట్ చేస్తుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌తో భారత్‌లో ఏఐ మౌలిక వసతులు నిర్మిస్తామని ఎన్విదియా వేరొక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న దాని కంటే శక్తిమంతమైన ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ తయారు చేస్తామని పేర్కొంది. అత్యంత ఆధునిక ఎన్విదియా Nviddia జీహెచ్200 గ్రేస్ హుపర్ సూపర్ చిప్, ఎన్విదియా డీజీఎక్స్ క్లౌడ్, క్లౌడ్‌లో సూపర్ కంప్యూటింగ్ సర్వీస్ పొందొచ్చు. రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్స్‌తో భాగస్వామ్యం పొందినందుకు గర్వంగా ఉందని ఎన్విదియా సీఈఓ కం ఫౌండర్ జెన్సన్ హాంగ్ తెలిపారు.
0 Comments