హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పూణె నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్ ఈరోజు లాంఛ్ అయింది. జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్స్ కేవలం రూ.599 నుంచే ప్రారంభం అవుతాయి. మొత్తం 6 ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, గృహ అవసరాలు, బిజినెస్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వేర్వేరు ప్లాన్స్ రూపొందించింది రిలయన్స్ జియో ఈ ప్లాన్స్ తీసుకున్నవారికి డేటా బెనిఫిట్స్‌తో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. జియో ఎయిర్‌ఫైబర్‌తో హైస్పీడ్ వైఫై సర్వీస్, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్, క్లౌడ్ పీసీ, సెక్యూరిటీ, సర్వేలెన్స్ సొల్యూషన్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ , స్మార్ట్ హోమ్ ఐఓటీ, గేమింగ్, హోమ్ నెట్వర్కింగ్ లాంటి సేవల్ని పొందొచ్చు. వైఫై రౌటర్, 4కే స్మార్ట్ సెట్ టాప్ బాక్స్, వాయిస్ యాక్టీవ్ రిమోట్ ఉచితంగా లభిస్తాయి. జియో ఎయిర్‌ఫైబర్ రూ.599 ప్లాన్ తీసుకున్నవారికి 30ఎంబీపీస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా ఉచితం. 550పైగా డిజిటల్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ చేయొచ్చు. 14 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. జియో ఎయిర్‌ఫైబర్ రూ.899 ప్లాన్ తీసుకున్నవారికి 100ఎంబీపీస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా ఉచితం. 550పైగా డిజిటల్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ చేయొచ్చు. 14 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. జియో ఎయిర్‌ఫైబర్ రూ.1199 ప్లాన్ తీసుకున్నవారికి 100ఎంబీపీస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా ఉచితం. 550పైగా డిజిటల్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ చేయొచ్చు. 14 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. జియో ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ రూ.1499 ప్లాన్ తీసుకున్నవారికి 300ఎంబీపీస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా ఉచితం. 550పైగా డిజిటల్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ చేయొచ్చు. 14 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. జియో ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ రూ.2499 ప్లాన్ తీసుకున్నవారికి 500ఎంబీపీస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా ఉచితం. 550పైగా డిజిటల్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ చేయొచ్చు. 14 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. జియో ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ రూ.3999 ప్లాన్ తీసుకున్నవారికి 1000ఎంబీపీస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా ఉచితం. 550పైగా డిజిటల్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ చేయొచ్చు. 14 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. జియోఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ ప్లాన్స్ కొన్ని నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ తీసుకోవాలనుకునేవారు 60008-60008 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి వాట్సప్‌లో బుకింగ్ చేయొచ్చు. లేదా www.jio.com వెబ్‌సైట్‌లో బుకింగ్ చేయొచ్చు. సమీపంలోని జియో స్టోర్‌ను సందర్శించవచ్చు. సింపుల్ స్టెప్స్‌లో జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ పొందొచ్చు.
0 Comments