హానర్ వి పర్స్ స్మార్ట్ ఫోన్ బ్లాక్, బ్లూ, గోల్డెన్ కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టారు. ఈ ఫోన్‌కి చైన్‌ని కూడా తగిలించి పర్సులాగా తీసుకెళ్లవచ్చు. ఈ ఫోన్ 16GB + 256GB, 16GB + 512GB వేరియంట్‌లు వరుసగా CNY 5,999 (సుమారు రూ.68,400), CNY 6,599 (సుమారు రూ.75,300) ధరకు లభిస్తున్నాయి. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇంకా చెప్పలేదు. హానర్ V పర్స్ 7.71-అంగుళాల ఔటర్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే, మడతపెట్టిన తర్వాత అది 6.45-అంగుళాల ప్యానెల్‌గా మారుతుంది. ఇందులో, వినియోగదారులు 1,600 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని పొందుతారు. దీని ఔటర్ డిస్‌ప్లేని వినియోగదారుల దుస్తులతో పోలిన విధంగా సెట్ చేసుకోవచ్చు. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్‌తో 16GB వరకు RAMని కలిగి ఉంది, ఈ ఫోన్ Android 13 ఆధారిత MagicOS 7.2పై నడుస్తుంది. ఫొటోగ్రఫీ కోసం, ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కోసం 9MP కెమెరా ఉంది. దీని బ్యాటరీ 4,500mAh, 35W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
0 Comments