ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ రంగం వినూత్న ఆవిష్కరణలకు వేదిక అవుతోంది. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీని లాంఛ్ చేసిన అనంతరం ఏఐ టూల్స్‌పై టెకీల్లో హాట్ డిబేట్ సాగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు సైతం తమ సొంత ఏఐ చాట్‌బాట్స్‌ను ఆవిష్కరించాయి, ఇక మెటా పలు ప్రోడక్ట్స్‌తో పాటు ఏఐ అసిస్టెంట్‌ను లాంఛ్ చేసింది. కనెక్ట్ లాంఛ్ ఈవెంట్ వేదికగా లైవ్ స్ట్రీమింగ్ ఫెసిలిటీతో మెటా స్మార్ట్ గ్లాస్‌లను ప్రవేశపెట్టింది. ఇక మెటా ఏఐ వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది. యూజర్ల సెర్చి ఆధారంగా రియల్ టైం ఇన్ఫర్మేషన్‌ను మెటా ఏఐ యాక్సెస్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్ బింగ్‌తో భాగస్వామ్యంతో ఇమేజ్ జనరేషన్ టూల్‌ను కూడా ఆఫర్ చేస్తుందని మెటా తన బ్లాగ్‌లో పేర్కొంది. ఏఐ అసిస్టెంట్‌తో పాటు రేబాన్‌తో కలిసి న్యూ స్మార్ట్ గ్లాసెస్‌ను మెటా ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ గ్లాసెస్ మ్యూజిక్‌ను ప్లే చేయడం, ఫొటోలను క్యాప్చర్ చేయడం, వీడియోలను రికార్డు చేయడంతో పాటు యూజర్లు వీక్షించే కార్యక్రమాలను నేరుగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలో లైవ్‌స్ట్రీమ్ చేస్తాయి. యూజర్లు స్పాట్ నుంచే ప్రివ్యూలో కామెంట్స్‌ను చూడటంతో పాటు మెసేజ్‌లను వినవచ్చని స్మార్ట్ గ్లాసెస్ లాంఛ్ చేస్తూ మెటా బ్లాగ్ పోస్ట్‌లో్ రాసుకొచ్చింది.
0 Comments