వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌ను మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్‌ఫేస్‌లో మార్పులు చేసిన తర్వాత కొందరికి గుర్తించడం కష్టమవుతుందని సమాచారం. ప్రొఫైల్ ఐకాన్ టాప్‌లో కనిపించనుంది. సెర్చ్ బార్, కెమెరా ఐకాన్ కూడా టాప్‌లోనే ఉండనుంది. దీంతోపాటుగా యాప్ మొత్తం తెలుపు రంగులోనే కనిపించనుంది.ఇంటర్‌ఫేస్‌లో మార్పులు తర్వాత వాట్సాప్ ఎక్కువగా వినియోగించే యువతకు పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. అదే వాట్సాప్‌ను తక్కువగా ఉపయోగించే వారికి అలవాటు అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. తాజాగా వచ్చిన వాట్సాప్ బీటా వెర్షన్‌లో ఉన్న విధంగా వాట్సాప్‌లో పైన కనిపిస్తున్న గ్రీన్ కలర్‌ను తీసివేసింది. దీంతోపాటు మరికొన్నింటిలో మార్పులు చేసింది.వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo ఆధారంగా యూజర్ ఇంటర్‌ఫేస్‌లో కీలక మార్పులు రానున్నాయి. స్టేటస్, చాట్స్, ఇతర ట్యాబ్‌లు యాప్ దిగువన కనిపించనున్నాయి. కమ్యూనిటీస్‌కు ప్రత్యేక ట్యాబ్ రానుంది. వాట్సాప్ యాప్ పైభాగంలో ఉండే గ్రీన్ కలర్‌ను తొలగిపోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత వెర్షన్‌లో యాప్ పైభాగంలో గ్రీన్ కలర్ ఉంటుంది.వాట్సాప్ లోగో, మెసెజ్ బటన్ మాత్రం గ్రీన్ రంగులోనే ఉండనున్నాయి. యాప్ పైభాగంలో ఫిల్టర్ ఆప్షన్ కనిపించనుంది. ఇందులో అన్‌రీడ్, పర్సనల్, బిజినెస్ పేరిట ప్రత్యేక ఫిల్టర్‌లు ఉంటాయి. దీంతో అవసరమైన మెసెజ్‌లను వెంటనే చూసేందుకు వీలు ఉంటుంది. అయితే దీని పూర్తి పనితీరుపై స్పష్టత రావాల్సి ఉంది.వాట్సాప్ బీట్ ఆండ్రాయిడ్ 2.23.13.16 వెర్షన్‌లో కనిపించనుంది. కొత్త UI అప్‌డేట్ మెటిరీయల్ డిజైన్ 3 UI ఎలిమెంట్‌ను కలిగి ఉంది. అయితే ఈ డిజైన్ ఇంకా అభివృద్ధిలో ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న కాలంలో వాట్సాప్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా, యూజర్ల అవసరాలకు సరిపోయేలా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీటా వెర్షన్‌లో అంతా సక్రమంగా ఉంటే.. త్వరలో ఈ మార్పులు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాట్సాప్ ద్వారా HD వీడియోలను షేరింగ్ చేసే ఫీచర్ కొంత మందికి అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా 720P HD నాణ్యతతో వీడియోలను పంపవచ్చు. ఇప్పటి వరకు వాట్సాప్ ద్వారా పంపించిన వీడియోలు ఆటోమేటిక్‌గా 480P నాణ్యతకు తగ్గించబడ్డాయి. అయితే కొత్త ఫీచర్ ద్వారా 1080p లేదా 4K నాణ్యతతో వీడియోలను పంపేందుకు వీలులేదు.
వాట్సాప్ ద్వారా HD వీడియోలను పంపేందుకు యాప్ అప్‌డేట్ చేసి ఉండాలి. అనంతరం ఎవరికి పంపించాలి అనుకుంటున్నారో వారి చాట్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత HD బటన్ కనిపిస్తుంది. దీని వీడియో నాణ్యతను మార్చేందుకు వీలు ఉంటుంది. వీడియో నాణ్యత ఎంపిక తర్వాత పంపించాలి.దీంతోపాటు వాట్సాప్ ఫోటో క్యాఫ్షన్ ఎడిట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అంటే ఏదైనా ఫోటో, వీడియోను పంపినప్పుడు వాటి హెడ్‌లైన్‌లో మార్పులు చేసేందుకు వీలు లేదు. అయితే తాజా అప్‌డేట్‌తో ఫోటో, వీడియో పంపిన 15 నిమిషాల వరకు హెడ్‌లైన్‌లో మార్పులు చేయవచ్చు. ఇప్పటికే ఈ అవకాశం మెసేజ్‌లకు ఉంది. మెసెజ్ పంపిన 15 నిమిషాల వరకు ఎడిట్ చేసుకొనే అవకాశం ఉంది. గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది.
0 Comments