దేశీయ మార్కెట్లోకి మోటోరోలో మోటో ట్యాబ్ జీ84 పేరుతో కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది మొదట్లో మోటోరోలా నుంచి వచ్చిన మోటో ట్యాబ్ జీ70కి కొనసాగింపుగా దీనిని తీసుకురానున్నారు. కంపెనీ ఈ ట్యాబ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కొత్త ట్యాబ్‌లో ల్యాండ్‌స్కేప్ ఓరియెంటెడ్ కెమెరాను ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ట్యాబ్‌ను మెటాలిక్ డ్యూయల్ కలర్ డిజైన్‌తో తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇక ఈ ట్యాబ్‌లో జేబీఎల్ స్పీకర్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.. ఇక ఇది సౌండ్ డాల్బీ ఆటమ్స్‌కు సపోర్ట్ చేస్తుంది.. ఇకపోతే ఇక కెమెరా విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాతో పాటు, ఫ్రంట్ కెమెరాను కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే 10.6 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారని టాక్. మెమోరీ కార్డ్ సపోర్ట్‌తో ట్యాబ్ ఇంటర్నల్ మెమోరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ ట్యాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆన్ లైన్ లో లీక్ అయిన వివరాల ప్రకారం రూ. 20 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో మోటోరోలా విడుదల చేసిన మోటో ట్యాబ్ జీ70 ట్యాబ్ ధర రూ. 21,99గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్యాబ్ తో పోల్చితే ప్రస్తుతం రానున్న కొత్త ట్యాబ్ ఫీచర్లు ఎక్కువగా ఉండనున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ధర విషయంలో మాత్రం పాత ట్యాబ్ కంటే తక్కువ ధరే ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు..
0 Comments