ఐక్యూ ఇండియా నుంచి నియో సిరీస్‌లో ఐక్యూ నియో 7 5జీ మోడల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఐక్యూ నియో 6 అప్‌గ్రేడ్ వర్షన్ ఇది. ఇందులో 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్, 64MP ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఐక్యూ నియో 7 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. రిలీజ్ ధరలు చూస్తే 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2,000 తగ్గింది. ప్రస్తుత ధరలు చూస్తే 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.27,999 కాగా, 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.27,999. అమెజాన్‌లో ఐకూ నియో 7 5జీ కొనేవారికి బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. పలు బ్యాంక్ కార్డులతో రూ.1750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ రూ.1700 నుంచి ప్రారంభం అవుతుంది. రోజూ రూ.60 చొప్పున చెల్లిస్తే చాలు. ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, ఫ్రాస్ట్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లేకు బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 వరకు అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 64మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్ స్టైల్ వీడియోలు రికార్డ్ చేయడానికి వ్లాగ్ మోడ్ ఉంది. డ్యూయెల్ వీడియో రికార్డ్ చేయొచ్చు. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది.
0 Comments