దేశీయ మార్కెట్లోకి షియోమీ సంస్థ రెడ్ మీ సిరీస్ లో 43-అంగుళాల రెడ్ మీ స్మార్ట్ ఫైర్ టీవీ 4కే 43ని ఈ రోజు విడుదల చేసింది. ఈ సరికొత్త స్మార్ట్ టీవీ బడ్జెట్ ధరలో ప్రత్యేకమైన డిజైన్ మరియు నాణ్యమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ టీవీ డిస్‌ప్లే 3840 x 2160 పిక్సెల్‌లు, ఆటో తక్కువ లేటెన్సీ మోడ్, 6.5ఎంఎస్ రెస్పాన్స్ టైమ్‌తో సహా అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. అలాగే, ఈ రెడ్‌మీ టీవీలో వివిడ్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీ ఉంది. థియేటర్ అనుభూతిని అందిస్తుంది. మెటల్ బెజెల్-లెస్ డిజైన్ తో పాటు క్వాడ్-కోర్ కార్టెక్స్ A55 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. మరియు గేమింగ్ ప్రియులను ఆకర్షించేందుకు Mali-G52 MC1 GPU గ్రాఫిక్స్ కార్డ్ ఇవ్వబడింది. Fire OS 7 పై పనిచేస్తుంది. అలాగే ఈ TV 2GB RAM మరియు 8GB స్టోరేజీ సౌకర్యాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్, డిస్నీ+ హాట్ స్టార్, Zee5, సోనీ లైవ్, యూట్యూబ్ మొదలైన వివిధ యాప్‌లను ఈ సరికొత్త స్మార్ట్ టీవీలో ఉపయోగించవచ్చు. 43 అంగుళాల రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ అలెక్సా వాయిస్ సపోర్ట్‌తో కూడిన స్మార్ట్ రిమోట్‌ను కలిగి ఉంది. కాబట్టి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌తో కూడిన ఈ రిమోట్‌తో మీరు టీవీని అందంగా ఆపరేట్ చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీ స్మార్ట్ రిమోట్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ కోసం షార్ట్‌కట్ బటన్‌లు ఉన్నాయి. వై-ఫై 802.11 AC, ఎయిర్‌ప్లే 2, మిరాకాస్ట్, బ్లూటూత్ 5.0, HDMI పోర్ట్, USB పోర్ట్, 3.5mm ఆడియో జాక్, ఈథర్‌నెట్, యాంటెన్నా వంటి బహుళ కనెక్టివిటీ సపోర్ట్‌లు ఉన్నాయి. 43-అంగుళాల రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీని రూ. 26,999కి విడుదల చేశారు. అయితే, పరిమిత సమయం వరకు, 43 అంగుళాల రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ రూ.24,999 ధరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. కంపెనీ సేల్ తేదీని ఇంకా పేర్కొనలేదు. అయితే, ఈ టీవీ రాబోయే పండుగ సీజన్‌లో Mi.com మరియు అమెజాన్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
0 Comments