దేశీయ మార్కెట్లోకి ఇన్‌ఫినిక్స్ 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తోంది. ఇప్పుడు దీని ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. మీడియా టెక్ డైమెన్సిటీ 8029 ఎస్వోసీ చిప్‌సెట్‌తోపాటు 12 జీబీ రామ్‌తో ఇన్‌ఫినిక్స్ జీరో30 వస్తోంది. 144 రీఫ్రెష్ రేటుతోపాటు హోల్ పంచ్ డిస్ ప్లే, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా ఉంటుంది. 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999, టాప్ హై ఎండ్ 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ వేరియంట్ ధర రూ.24,999 పలుకుతుంది. గోల్డెన్ అవర్, రోమ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఫోన్ లభిస్తుంది. సప్టెంబర్ 8 నుంచి ఫోన్ల డెలివరీ ప్రారంభిస్తున్నట్లు ఇన్‌ఫినిక్స్ తెలిపింది. యాక్సిస్ క్రెడిట్ కార్డు పై కొనుగోలు చేసే వారికి రూ.2000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. రూ.23,050 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందిస్తోంది. నో-కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎక్స్ఓఎస్ 13 వర్షన్‌పై పని చేస్తుంది. 6.78-అంగుళాల ఫుల్ హెచ్డీ + (2400×1080 పిక్సె్ల్స్) 6-డిగ్రీ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్ ప్లే విత్ 144 రీఫ్రెష్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్ కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 12 జీబీ రామ్ కెపాసిటీ ఉన్నా ఆన్ బోర్డ్ మెమరీతో 21 జీబీ రామ్ వరకూ విస్తరించవచ్చు. క్వాడ్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఓఐఎస్ సపోర్ట్, 13 -మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ షూటర్, 2-మెగా పిక్సెల్ సెన్సర్, సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో వస్తుంది. సెకన్‌కు 60 ఫ్రేమ్స్‌తో 4కే వీడియో రికార్డింగ్ చేయొచ్చు. 5జీ, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లూ టూత్ 5.3, వై-ఫై 6 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్‌తోపాటు అంబియెంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, జీ-సెన్సర్, గైరో స్కోప్, ప్రాగ్జిమిటీ సెన్సర్ వంటి ఫీచర్లు ఉంటాయి.
0 Comments