యాపిల్ 15 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లను రిలీజ్ చేసింది. విక్రయాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే ప్రస్తుతం ఐఫోన్ 15 సిరీస్ ధరల గురించే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమెరికా, దుబాయ్‌తో పోలిస్తే భారత్‌లోనే ఐఫోన్ 15 సిరీస్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. భారత దేశంలో తయారయ్యే ఐఫోన్ల ధరలు ఆయా దేశాలతో పోల్చినప్పుడు ఇక్కడే అధికంగా ఉండడం విశేషం. ఐఫోన్ 15 మోడల్ ఆరంభ ధర అమెరికాలో 799 డాలర్లు. అదే భారత్‌లో రూ. 79,900గా ఉంది. 799 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 66,353 వేలు అవుతుంది. అయితే ఈ మోడల్ ధర దాదాపు 20 శాతం అధికంగా ఉండడం గమనార్హం. అరబ్ ఎమిరేట్స్‌లో దీని ధర 3,399 కాగా.. భారత కరెన్సీ (22 రూపాయలు = 1 దిర్హమ్) ప్రకారం రూ. 76 వేలు అవుతుంది. దుబాయ్‌తో పోల్చినా భారత్‌లోనే ధర ఎక్కువ. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బేస్ మోడల్ ధర అమెరికాలో 1,199 డాలర్లుగా ఉంది. దీన్ని భారత కరెన్సీలో రూ. 99 వేలు అవుతుంది. అయితే భారత్‌లో ప్రో మ్యాక్స్ బేస్ మోడల్ ధర రూ. 1.59 లక్షలుగా ఉంది. అంటే దాదాపు 50 శాతం అధికం. దుబాయ్‌లో ఈ మోడల్ ధర 5,099 దిర్హమ్‌లు. దిర్హమ్‌లను భారత కరెన్సీలో 1.15 లక్షలు. ఐఫోన్ 15 ప్లస్ మోడల్‌దీ అదే పరిస్థితి.
0 Comments