యూపీఐ లైట్‌ని ఉపయోగించడానికి వినియోగదారులు ముందుగా వారి లింక్ చేసిన బ్యాంక్ ఖాతా ద్వారా వారి యూపీఐ లైట్ ఖాతాకు డబ్బును జోడించాలి. ఖాతాను సెటప్ చేసిన తర్వాత వినియోగదారులు తమ యూపీఐ లైట్ ఖాతాకు రోజుకు రెండుసార్లు రూ. 2,000 వరకు పంపవచ్చు. రోజువారీ పరిమితి రూ.4,000గా ఉంది. తరచుగా చెల్లింపులు చేయాలనుకునే వ్యక్తులకు యూపీఐ లైట్ మంచి ఎంపిక. లైట్ వినియోగదారులు తమ ఖాతాను ఎప్పుడైనా మూసివేయవచ్చు లేదా వారి లైట్ ఖాతా నుంచి వారి బ్యాంక్ ఖాతాకు ఒకే క్లిక్‌తో ఎటువంటి రుసుము లేకుండా నిధులను బదిలీ చేయవచ్చు. గూగుల్ పేయాప్‌ను తెరిచి ఎగువ కుడి మూలలో ఉన్న మీ ప్రొఫైల్ చిత్రంపై నొక్కాలి. పే పిన్ ఉచిత యూపీఐ లైట్‌పై ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. యూపీఐ లైట్ బ్యాలెన్స్‌కు డబ్బును జోడించడానికి ఆన్-స్క్రీన్ సూచనలను అనుసరించారు. రూ.2,000 నిధులను యాడ్ చేసే అవకాశం ఉంటుంది. డబ్బును జోడించడానికి యూపీఐ లైట్‌కి మద్దతిచ్చే అర్హత ఉన్న బ్యాంక్ ఖాతాను ఎంచుకుని, డబ్బు జోడించాలి. డబ్బును జోడించిన తర్వాత మీరు మీ యూపీఐ పిన్‌ను నమోదు చేయకుండానే రూ. 200 వరకు చెల్లింపులు యూపీఐ లైట్ ద్వారా చేయవచ్చు. చెల్లింపు సమయంలో మీరు మీ యూపీఐ పిన్‌ని నమోదు చేయమని అడిగనప్పడు యూపీఐ లైట్ ఎంపికను ఎంచుకోవాలి.
ఫోన్‌పే యాప్‌ని తెరిచి, ఫోన్‌పే యాప్ హోమ్ స్క్రీన్‌పై యూపీఐ లైట్‌ని నొక్కాలి. మీరు మీ ప్రొఫైల్ చిత్రాన్ని నొక్కి చెల్లింపు పద్ధతుల విభాగంలో యూపీఐ లైట్‌ని ఎంచుకోవాలి. అక్కడ యూపీఐ లైట్ బ్యాలెన్స్‌కు డబ్బును జోడించడానికి ఆన్-స్క్రీన్ సూచనలను అనుసరించాలి. మీరు రూ. 2,000 వరకు జోడించవచ్చు. మీ యూపీఐ లైట్ బ్యాలెన్స్‌కు డబ్బును జోడించిన తర్వాత మీరు మీ యూపీఐ పిన్‌ను నమోదు చేయకుండానే రూ.200 వరకు చెల్లింపులు చేయవచ్చు.
పేటీఎం యాప్‌ను తెరిచి హోం పేజీలో ఇంట్రడ్యూసింగ్ యూపీఐ లైట్‌పైక్లిక్ చేయాలి. అనంతరం యూపీఐ లైట్ ద్వారా సపోర్ట్ చేసే లింక్ చేసిన బ్యాంక్ ఖాతాను ఎంచుకుని డబ్బుని జోడించాలి. డబ్బు జోడించిన తర్వాత మీరు క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా లేదా యూపీఐ ఐడీతో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు గ్రహీతకు చెల్లించవచ్చు. https://t.me/offerbazaramzon
0 Comments