Ad Code

దేశీయ మార్కెట్లోకి ఐటెల్ ఏ 60 ఎస్


దేశీయ మార్కెట్లోకి ఐటెల్  ఏ సిరీస్  ఏ 60 ఎస్  ఆవిష్కరించింది. ఇది బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. ఐటెల్ ఏ60స్  పేరుతో ఆవిష్కరిస్తున్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ 6.6-అంగుళాల హెచ్డీ + ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ సపోర్ట్స్ విత్ 10 వాట్ల స్టాండర్డ్ చార్జింగ్ కలిగి ఉంటుంది. ఓక్టాకోర్ ప్రాసెసర్ తో వస్తున్నది. బయోమెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్ లాక్ సెన్సర్లు ఉంటాయి. 8-మెగా పిక్సెల్స్ ఏఐ ఆధారిత ప్రైమ్ సెన్సర్‌తోపాటు డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తున్నది ఐటెల్ ఏ60స్. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఐటెల్ ఏ60ఎస్ రూ.6,499 లకే లభిస్తుంది. మూడు కలర్ ఆప్షన్స్ షాడో బ్లాక్, మూన్ లైట్ వయోలెట్, గ్లాసియర్ గ్రీన్ కలర్స్ లో అందుబాటులో ఉంది. అమెజాన్‌తోపాటు ఇతర రిటైల్ ఔట్ లెట్లలో ఈ నెల 12 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. ఐటెల్ ఏ60స్ ఫోన్ 6.6 అంగుళాల హెచ్డీ + (720×1612 పిక్సెల్స్) ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ విత్ వాటర్ డ్రాప్‌స్టైల్ నాచ్ డిస్ ప్లే విత్ 60 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 వర్షన్‌పై పని చేస్తుంది. క్వాడ్ కోర్ యూనిసోక్ ఎస్సీ986ఏ1 ఎస్వోసీ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. రేర్ ప్యానెల్‌పై 8-మెగా పిక్సెల్ ఏఐ ఆధారిత కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5-మెగాపిక్సెల్స్ కెమెరా కూడా ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్ లాక్ సెన్సర్ ఉంటుంది. ఈ ఫోన్ వై-ఫై, బ్లూ టూత్, 3.5 ఎంఎం ఆడియో జాక్, జీపీఎస్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu