ఇప్పుడంతా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పైనే దృష్టి సారించారు. మైక్రోసాఫ్ట్ అయితే బింగ్ లేటెస్ట్ వర్షన్ లో చాట్ జీపీటీని ఫీచర్ గా పెట్టేసింది. గూగుల్ కూడా ఏఐ చాట్ బాట్ బార్డ్ ని పరిచయం చేసింది. అయితే ఇప్పటి వరకు ఈ చాట్ జీపీటీని కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లలో మాత్రమే వాడారు. కానీ, మొదటిసారి ఈ చాట్ జీపీటీ స్మార్ట్ వాచ్ లోకి అడుగుపెట్టింది. అమేజ్ ఫిట్ సంస్థ తమ స్మార్ట్ వాచ్ లలో చాట్ జీపీటీని ప్రవేశపెట్టింది. అమేజ్ ఫిట్ స్మార్ట్ వాచ్ బ్రాండ్ అనేది ఇండియాలో కూడా చాలా పాపులర్ అనే చెప్పాలి. ఈ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచెస్ కు చాలా మంది ఆదరణ ఉంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే చాలా స్మార్ట్ వాచెస్ మార్కెట్ లోఅందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ వాచ్ కంపెనీ తమ మార్కెట్ ను మరించగా పెంచుకునేందుకు ఓ అడుగు ముందుకేసింది. తమ స్మార్ట్ వాచెస్ లోకి రీసెంట్ సెన్సేషన్ చాట్ జీపీటీని ప్రవేశ పెట్టింది. అయితే నేరుగా చాట్ జీపీటీతో చాట్ చేయడం కుదరదు కానీ.. చాట్ జీపీటీ థీమ్ తో వాచ్ ఫేస్ ని ప్రవేశ పెట్టింది అనమాట. జెప్ ఓఎస్ లో ఈ టూల్ ని అప్ డేట్ చేశారు. దాని ద్వారా అన్ని అమేజ్ ఫిట్ స్మార్ట్ వాచెస్ లో ఈ చాట్ జీపీటీ వాచ్ ఫేస్ ను పెట్టుకోవచ్చు. అయితే కేవలం వాచ్ ఫేస్ అని తీసిపారేయకండి. ఈ వాచ్ ఫేస్ ద్వారా ఏఐ టెక్నాలజీ సాయంతో మనిషి మాదిరిగానే అమేజ్ ఫిట్ వాచెస్ ఇంటరాక్ట్ అవుతాయి. ఈ వాచ్ ఫేస్ మీ ఫుట్ స్టెప్ కౌంట్, హార్ట్ రేట్, ఫిట్ నెస్ డేటా, కేలరీస్ బర్న్ వంటి సమాచారాన్ని చాట్ జీపీటీ థీమ్ లో చూపిస్తూ ఉంటుంది. అలాగే ఈ వాచ్ మిమ్మల్ని విష్ చేస్తుంది కూడా. ఒక నూతన అప్ డేట్ ద్వారా అన్ని అమేజ్ ఫిట్ వాచెస్ కి ఈ చాట్ జీపీటీ థీమ్ వాచ్ ఫేస్ ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
0 Comments