Ad Code

టాటా నుంచి ఇ-బైక్ స్ట్రైడర్ జీటా !


టాటాకు బ్రాండ్ స్ట్రైడర్ నుంచి లేటెస్ట్ ఎడిషన్ ఇ-బైక్స్ లాంఛ్ అయ్యాయి. స్ట్రైడర్ జీటా పేరుతో సరికొత్త ఇ-బైక్ లాంఛ్ చేసింది కంపెనీ. ఈ బైక్ ధర రూ.31,999. కంపెనీ 20 శాతం లిమిటెడ్ టైమ్ డిస్కౌంట్ ప్రకటించింది. డిస్కౌంట్‌తో స్ట్రైడర్ జీటా ఇ-బైక్‌ను రూ.25,599 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇ-బైక్ గ్రీన్, గ్రే కలర్స్‌లో లభిస్తుంది. ఫీచర్స్ చూస్తే ఇందులో 36 V 250 W BLDC రియర్ హబ్ మోటార్ ఉంది. ఈ మోటార్‌తో అన్ని రకాల భూభాగాలపై సులభంగా రైడ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఇ-బైక్ లోపల లిథియం-అయాన్ బ్యాటరీ, కంట్రోలర్‌తో వస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేస్తే హైబ్రిడ్ రైడ్ మోడ్‌లో 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అంటే పెడల్, ఎలక్ట్రిక్ మోడ్ కలిపి 40 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో అయితే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. వేగం విషయానికి వస్తే పెడల్ కాకుండా గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీనిలో ఆటో కట్ బ్రేక్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ప్రతీ కిలో మీటర్ ప్రయాణానికి 10 పైసల ఖర్చు మాత్రమే అవుతుంది. అంటే 100 కిలోమీటర్ల జర్నీకి రూ.10 మాత్రమే ఖర్చవుతుందని కంపెనీ చెబుతోంది. ఆరోగ్యం, స్థిరత్వం ప్రాధాన్యతతో, శక్తి-సమర్థవంతమైన, ఆరోగ్యకరమైన దేశం కోసం ప్రభుత్వ దృష్టికి అనుగుణంగా సరసమైన రవాణా ఎంపికలను స్ట్రైడర్ అందిస్తోందని, ఫిట్ ఇండియా మిషన్‌కు చురుకుగా మద్దతు ఇవ్వడం, ఆరోగ్య స్పృహ కలిగిన ప్రయాణికులకు పర్యావరణ అనుకూల రవాణా పరిష్కారాలను అందించడంలో స్ట్రైడర్ ముందుందని స్ట్రైడర్ బిజినెస్ హెడ్ రాహుల్ గుప్తా అన్నారు. ఇ-బైక్‌లో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. 27.5 అంగుళాల టీఐజీ వెల్డెడ్ స్టీల్ ఫ్రేమ్, 18 టీత్ ఫుల్ బాల్ లాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. స్ట్రైడర్ జీటా ఇ-బైక్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3 గంటల సమయం పడుతుంది. దీనిని ఆన్‌లైన్‌లో కొనొచ్చు. షిప్పింగ్ ఉచితం. బ్యాటరీ, మోటార్‌కు రెండేళ్ల వారెంటీ లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. స్ట్రైడర్ నుంచి ఇతర ఇ-బైక్స్, గేర్డ్ బైక్స్ కూడా ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu