లెనోవో కంపెనీ థింక్‌ఫోన్ బ్రాండింగ్‌తో మొదటి స్మార్ట్‌ఫోన్ మోటోరోలో ద్వారా థింక్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇది 6.6 ఇంచెస్ FHD+ 144Hz పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఇది స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ద్వారా పని చేస్తుంది. ఇది స్టీల్ కంటే బలంగా ఉండే తేలికపాటి అరామిడ్ ఫైబర్‌తో రూపొందించామని, ఎయిర్‌క్రాఫ్ట్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, గొరిల్లా గ్లాస్ సులభంగా విక్టస్. 1.25 మీటర్ల నుంచి షాక్ ను తట్టుకునెలా రూపొందించామని కంపెనీ తెలిపింది. థింక్‌ఫోన్ ను 30 నిమిషాల వరకు 1.5 మీటర్ల లోతుతో దుమ్ము, నీటి ఇమ్మర్షన్‌ను తట్టుకునేలా రూపొందించారు. అత్యంత క్లిష్టమైన వ్యాపార, ఫీల్డ్ యాప్ వెంటనే యాక్సెస్ అవ్వడం దీని ప్రత్యేకత అలాగే మొబైల్, పీసీ ను కనెక్ట్ చేసుకునే అవకాశం ఈ థింక్ ఫోన్ లో ఉంది. ఆండ్రాయిడ్‌లో నడుస్తున్న మోటో కీసేఫ్ అనే ప్రత్యేక ప్రాసెసర్ ద్వారా అత్యంత సున్నితమైన డేటాను మెరుగ్గా రక్షించడానికి మరొక భద్రతను జోడిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది పిన్‌లు, పాస్‌వర్డ్‌లు మరియు క్రిప్టోగ్రాఫిక్ కీలను వేరు చేస్తుంది. 6.6 ఇంచెస్ పూర్తి హెచ్ డీ ప్లస్ డిసిప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 8+1 ప్రాసెసర్, 8 జీబీ+256 ర్యామ్, అలాగే 512 జీబీ వరకూ ఎక్స్ పాండబుల్ మెమరీ సపోర్ట్, 50 ఎంపీ బ్యాక్ కెమెరా, 13 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, యూఎస్ బీ టైప్ సీ ఆడియో, స్టీరియో స్పీకర్లు, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్పెషల్ రెడ్ కీ, 68 వాట్స్ వైర్ డ్ చార్జింగ్, 15 వాట్స్ వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఈ ఫోన్ మొదటగా యూఎస్, యూరోప్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, ఈ సంవత్సరం చివర్లో ఆసియా అంతటా ఎంపిక చేసిన దేశాల్లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
0 Comments