అమెరికాలోని లియోన్ వ్యాలీలో శాన్ ఆంటోనియో ఇంట్లో డావేన్ అరింగ్‌టన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను తెల్లవారు జామున జిమ్‌కు వెళ్లడానికి బయటకు వచ్చినప్పుడు తన కారు కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయాడు. రాత్రికి రాత్రే ఎవరో తన కారును దొంగిలించినట్లు గుర్తించాడు. తన్ ఐఫోన్‌లో ఫైండ్ మై యాప్‌ను ఓపెన్ చేయడంతో తన ఎయిర్‌పాడ్‌ల లొకేషన్ కనిపించింది. ఎయిర్‌పాడ్ లొకేషన్ ఆధారంగా నిందితులు ఎక్కడ ఉన్నారో సులువుగా తెలుసుకో గలిగాడు. ఎయిర్‌పాడ్‌లు ఇంటర్‌స్టేట్ 35లోని ట్రావెల్ స్టాప్ లొకేషన్‌ను చూపించాయి. వెంటనే డావేన్ అరింగ్‌టన్ అక్కడకు చేరుకున్నాడు. అక్కడ పార్క్ చేసి ఉన్న ఓ SUVలో ఐదుగురు వ్యక్తులు ఉండటం గమనించాడు. వెంటనే సహాయం కోసం ఆరింగ్టన్ పోలీసులకు సమాచారం అందించాడు. ఆ సమయంలో నిందితులు నిద్ర మేల్కొని SUV నుంచి పారిపోయారు. దొంగిలించిన ఎయిర్‌పాడ్‌ల లొకేషన్ ద్వారా నలుగురు వ్యక్తులను కాలినడకనే శాన్ ఆంటోనియో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదో నిందితుడు SUVలో పరారయ్యాడు. ఛేజింగ్ సమయంలో అతను సుమారు 100mph వేగంతో కారు డ్రైవ్ చేసినట్లు తెలిసింది. అనంతరం పోలీసులు నిందితులను విచారించి.. మరో ప్రాంతంలో ఉంచిన కారును స్వాధీనం చేసుకుని, అరింగ్టన్‌కు అప్పగించారు. దీంతో అదే రాత్రి ఆ ప్రాంతంలో జరిగిన ఇతర కార్ల చోరీలకు సంబంధించిన కేసులు కూడా పోలీసులు ఛేదించినట్లు అయింది. బాధితుల వస్తువులను తిరిగి అందజేశారు.
0 Comments