Ad Code

ఎయిర్‌టెల్‌ నుంచి 'వరల్డ్‌ పాస్‌'

దేశంలో 5G సేవలను విస్తరించే పనిలో ఉన్న టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ తాజాగా మరో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. 'వరల్డ్ పాస్'  పేరుతో పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ వినియోగదారులకు కొత్త ఇంటర్నేషనల్‌ రోమింగ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లు 184 దేశాలలో పనిచేస్తాయి. ఇప్పుడు వినియోగదారులు కొత్త ప్యాక్‌ను కొనుగోలు చేయకుండా ఒకే రోమింగ్ ప్యాక్‌తో రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలకు ప్రయాణించవచ్చు.  ఎయిర్‌టెల్ వరల్డ్ పాస్ అనేది అన్ని ప్రయాణ అవసరాలను తీర్చే ప్యాక్‌. దీన్ని 184 దేశాలలో పనిచేస్తుంది.  పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ కనెక్షన్‌ల కోసం ఇంటర్నల్‌ రోమింగ్ ప్లాన్‌ల సిరీస్‌గా పేర్కొంటున్నారు. ఈ ప్లాన్‌లు 99100-99100 అనే ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు 24x7 కస్టమర్ సపోర్ట్ అందిస్తాయి. ఈ నంబర్ వాట్సాప్‌ మెసేజెస్‌, కాల్స్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఒక దేశంలో ఎక్కువ కాలం ఉండేందుకు ప్లాన్ చేసే వారి కోసం ఒక సంవత్సరం వరకు వాలిడిటీతో ఉండే ప్లాన్స్‌ ఉన్నాయి. ఆసక్తికరంగా ఈ ప్లాన్‌లు డేటా క్యాప్‌తో అన్‌లిమిటెడ్‌ డేటాతో ఉన్నాయి. ఎయిర్‌టెల్ కస్టమర్‌లు తమ వరల్డ్ పాస్ ప్లాన్‌లను కూడా ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ని ఉపయోగించి మేనేజ్ చేయవచ్చు. అవసరానికి అనుగుణంగా అదనపు డేటా, మినిట్స్‌ యాడ్‌ చేసుకునే ఆప్షన్‌ కూడా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu