సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తరచూ ఆసక్తికర వీడియోలు షేర్ చేసే, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ బ్యాటరీ వాహనానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వాహనం చూసేందుకు పెద్దసైజ్ బైక్‌లా కనిపిస్తోంది. వేర్వేరు సీట్లు కలిగిన ఈ పొడవాటి వాహనంలో ఆరుగురు కూర్చోవచ్చు. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర. 'గ్రామీణ ప్రాంతాల్లోని రవాణారంగ ఆవిష్కరణలు నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఇక్కడి అవసరాలే ఆవిష్కరణలకు మూలం' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు యువకుడి సృజనాత్మకతకు ఫిదా అవుతున్నారు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే.. ఏకంగా 150 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. దీనికి అయ్యే ఖర్చు కూడా కేవలం రూ. 8 నుంచి 10 రూపాయలే కావడం గమనార్హం. ఈ వాహనాన్ని తయారుచేసేందుకు రూ.12,000 ఖర్చు చేసినట్లు దాన్ని తయారుచేసిన యువకుడు అంటున్నారు. వాహన రూపకర్తను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
0 Comments