Ad Code

63 వేల కోట్లను చైనాకు తరలించిన వివో !


దేశంలోని స్మార్ట్ ఫోన్ మరియు ఎలక్ట్రానిక్స్ మార్కెట్ లో వివో సంస్థ అతి పెద్ద వాటాను కలిగి ఉంది. ఈ టెక్ సంస్థ ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఉండేందుకు దేశీయంగా పలు కంపెనీలతో విలీనమై భారీ నష్టాలను వెల్లడించేందుకు వివో ఇండియా దాదాపు 50% టర్నోవర్‌ను విదేశాలకు ప్రధానంగా చైనాకు పంపిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. వివో సంస్థ తన 50% టర్నోవర్‌ను గ్రాండ్ ప్రాస్పెక్ట్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్  కంపెనీకి పంపినట్లు చేబుతున్నది. ఈ GPICPL కంపెనీని చైనీయులు నిర్వహిస్తున్నారని ఆరోపించింది. ఈ కేసు విచారణలో భాగంగా వివో ఇండియా మరియు దాని అనుబంధ సంస్థలతో దేశవ్యాప్తంగా 48 ప్రదేశాలలో రెండు రోజులపాటు సోదాలు నిర్వహించిన తర్వాత ED ఈ ప్రకటనను విడుదల చేసింది. ఏజెన్సీ ప్రకారం ఇండియాలో వివో ఇండియా కంపెనీ మొత్తంగా ₹1,25,185 కోట్ల అమ్మకాలను నిర్వహించగా వివో ఇండియా సంస్థ సుమారు ₹62,476 కోట్ల రూపాయలను అక్రమంగా విదేశాలకు బదిలీ చేసింది. ED ఏజెన్సీ ప్రభుత చట్టపరంగానే వివో సంస్థ యొక్క కార్యాలయాల మీద రైడ్ చేసారు. అలాగే వీరి కార్యకలాపాల సమయంలో చట్ట ప్రకారం విధి విధానాలు అనుసరించబడ్డాయి. కొంతమంది చైనా జాతీయులతో సహా వివో ఇండియా ఉద్యోగులు సెర్చ్ ప్రొసీడింగ్‌లకు సహకరించలేదు మరియు సెర్చ్ లో లభించిన డిజిటల్ పరికరాలను తప్పించడానికి మరియు దాచడానికి ప్రయత్నించారు అని ఏజెన్సీ బృందం తెలిపింది. అలాగే ఇప్పటివరకు వివో ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ₹66 కోట్లు, రెండు కిలోల విలువైన బంగారం మరియు ₹73 లక్షల నగదుతో సహా సుమారు ₹465 కోట్ల గ్రాస్ బ్యాలెన్స్‌తో వివిధ సంస్థల 119 బ్యాంక్ అకౌంటులను స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలిపింది.


Post a Comment

0 Comments

Close Menu