Ad Code

ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి వాట్సాప్ చాట్ హిస్టరీ ట్రాన్స్‌ఫర్ ?


వాట్సాప్ లోని డేటా ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి మారినప్పుడు వాట్సాప్ చాట్‌ డేటా, ఫొటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు ఇలా మీడియా కంటెంట్‌నంతా ఐఫోన్‌కు బదిలీ చేయాలంటే తలప్రాణం తోకకి వస్తుంది. ప్రస్తుతం, ఐఓఎస్ డివైజ్ యూజర్లకు మాత్రమే చాట్స్‌ను శాంసంగ్ ఆండ్రాయిడ్ డివైజ్‌లకు బదిలీ చేసుకోవడానికి వాట్సాప్ వీలుకల్పిస్తుంది. కానీ మిగతా యూజర్లకు మాత్రం డేటా ట్రాన్స్‌ఫర్ క్లిష్టంగా మారింది. అయితే టెక్ నిపుణుల ప్రకారం ఆండ్రాయిడ్ యూజర్లు తమ కొత్త ఐఫోన్‌కు సులభంగా వాట్సాప్ చాట్ హిస్టరీ ని షేర్ చేసుకోవచ్చు. ఇందుకు గూగుల్ జిమెయిల్ బెస్ట్ టూల్‌గా పనిచేస్తుంది. వాట్సాప్ చాట్స్‌ను బ్యాకప్ తీసి, వాట్సాప్ సెట్టింగ్స్ కి వెళ్ళాలి. చాట్' ఆప్షన్‌పై క్లిక్ చేసి తరువాత 'చాట్ హిస్టరీ' ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. 'ఎక్స్‌పోర్ట్ చాట్' ఆప్షన్ ఎంచుకుని, మీరు ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్న చాట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చాట్‌ను విత్‌ఔట్ మీడియాతో ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నారా లేదా ఇన్‌క్లూడ్ మీడియాతో ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నారా అని ఒక మెసేజ్ కనిపిస్తుంది. మీడియా కంటెంట్ కూడా కావాలి అనుకుంటే మీరు ఇన్‌క్లూడ్ మీడియాపై క్లిక్ చేయాలి. అనంతరం మీ ఓన్ ఈమెయిల్ అడ్రస్‌ను రిసిపీయంట్‌గా నమోదు చేసుకోవాలి. ఈ చాట్స్‌ను రిస్టోర్  చేసుకోవడానికి మీ ఐఫోన్‌లోని లోకల్ స్టోరేజ్ లో ఈ-మెయిల్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. వాట్సాప్ వెరిఫికేషన్ పూర్తయ్యాక లోకల్ స్టోరేజ్ నుంచి ఈ చాట్‌ హిస్టరీని మీరు రిస్టోర్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు తమ చాట్ హిస్టరీని ఐఫోన్ డివైజ్‌లకు ఎక్స్‌పోర్ట్ చేయడానికి ఈ పద్ధతి మాత్రమే అధికారిక మార్గం. AnyTrans, PhoneTrans, MobileTrans, Dr.Fone, Syncios వంటి యాప్‌లు మీ చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు బదిలీ చేయడంలో మీకు సహాయపడతాయి. అయితే, ఈ టూల్స్ కోసం కొంత మేర డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అలానే వాటిని పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాట్ చరిత్రను బదిలీ చేయడానికి యూఎస్‌బీ కేబుల్‌ని ఉపయోగించి మీ మొబైల్ పరికరాలకు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది.ఇది చాలా సమయం తో కూడుకున్న పని. 

Post a Comment

0 Comments

Close Menu