వాట్సాప్ ను దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్నారు. దీంతో స్కామర్ల కన్ను వాట్సాప్‌పై పడింది. అమాయక యూజర్లు బురిడీ కొట్టించి అందినకాడికి దోచేద్దామని ఈ కేటుగాళ్లు వాట్సాప్‌లో సరికొత్త స్కామ్‌లకు తెరలేపుతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం గతంలో వాట్సాప్‌లో కలకలం సృష్టించిన ఒక ఓల్డ్ స్కామ్ మళ్లీ హల్ చల్ చేస్తోంది. లాటరీ గెలుచుకున్నారని ఆశ చూపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే ఈ ప్రమాదకర స్కామ్ పట్ల యూజర్లు జాగ్రత్త వహించాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ స్కామ్ గురించి ఎవరికీ అనుమానం కలగకుండా స్కామర్లు అమితాబ్ బచ్చన్, కౌన్ బనేగా కరోడ్‌పతి పేరు, ఫొటోలను ఉపయోగిస్తారు. లాటరీలో యూజర్ రూ. 25 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నట్లు తెలిపే పోస్టర్ పిక్‌తో నంబర్ +923060373744 నుంచి స్కామర్లు మెసేజ్ పంపిస్తారు. ఈ మెసేజ్‌లో 07666533352కు కాల్ చేసి లాటరీని గెలుచుకున్న విషయాన్ని తెలియజేయమని యూజర్లను స్కామర్లు కోరతారు. పోస్టర్‌తో పాటు బ్యాంక్ ఖాతాకు డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసుకునే ప్రాసెస్‌ను వివరించే ఒక ఆడియో మెసేజ్ కూడా వస్తుంది. ఈ మెసేజ్‌లో చెప్పిన ప్రాసెస్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఫాలో అవకూడదు. ఈ మెసేజ్‌లో చెప్పిన విధంగా చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని స్కామర్ల చేతికి చిక్కుతాయి. ఆపై మీ బ్యాంకు ఖాతాలోని డబ్బును స్కామర్లు కాజేస్తారు. స్కామర్‌లు గతంలో కూడా ఇలాంటి ట్రిక్స్‌ని ఉపయోగించి వినియోగదారులను మోసం చేసి వారి బ్యాంక్ ఖాతా నంబర్లు, మరిన్ని ఆర్థిక వివరాలను దొంగిలించారు. వాట్సాప్‌లో యూజర్లను మోసం చేయడానికి హ్యాకర్లు ఉపయోగించే అనేక మార్గాలలో ఇది ఒకటి. లాటరీ ద్వారా లేదా మరే ఇతర మార్గం ద్వారానైనా ఉచితంగా డబ్బులు ఇస్తామని వచ్చే మెసేజ్‌లకు అసలు స్పందించకూడదు. ఎందుకంటే ఇవన్నీ స్కామ్ మెసేజ్‌లే!. తెలియని నంబర్ నుంచి వచ్చే మెసేజ్‌లను నమ్మకూడదు. వాటిని వెంటనే డిలీట్ చేసుకోవాలి. ఈ స్కామ్ మెసేజ్‌ల్లో చాలా వరకు వ్యాకరణ దోషాలు, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇంకా అనేక తప్పులు ఉంటాయి. ఇలా భాషాపరమైన దోషాలున్న మెసేజ్‌ల్లోని లింక్స్‌ను క్లిక్ చేయకూడదు. అందులోని సమాచారాన్ని నమ్మకూడదు. ఒక మెసేజ్ స్కామ్ అని మీరు అనుమానించిన వెంటనే, నంబర్‌ను బ్లాక్ చేయాలి. అనుమానాస్పద ఫోన్ నంబర్ నుంచే వచ్చే మెసేజ్‌లను ఎప్పుడూ ఓపెన్ చేయకూడదు. ముఖ్యంగా భారతీయ డయలింగ్ కోడ్‌తో కాకుండా ఇతర దేశాల కోడ్ గల నంబర్ నుంచి వచ్చే మెసేజ్‌లను ఓపెన్ చేయకూడదు. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకుండా జాగ్రత్తపడాలి. నీ మొబైల్‌కి వచ్చే ఓటీపీని ఎవరితోనూ షేర్ చేయకూడదు. ఇలాంటి మెసేజ్‌లను ఎవరికీ ఫార్వర్డ్ చేయకూడదు.
0 Comments