Ad Code

టిక్‌టాక్ మళ్లీ వస్తుందా ?


అతి తక్కువ కాలంలో  ప్రజాదరణ పొందిన యాప్ టిక్‌టాక్. ఈ చైనీస్ వీడియో షేరింగ్ యాప్‌ సామన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమందిని ఆకట్టుకుంది. రెండేళ్ల క్రితం జాతీయ భద్రతా సమస్యల దృష్ట్యా భారత్ టిక్‌టాక్‌ను నిషేధించింది. దీనితో పాటు యుసి బ్రౌజర్, షీన్ వంటి 58 ఇతర యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. కానీ TikTok ఇప్పుడు భారత్‌లోకి తిరిగి ప్రవేశించాలని చూస్తోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ దేశీయ కంపెనీతో కలిసి తిరిగి భారత్‌లో తన ప్రస్థానాన్ని మళ్ళీ మొదలు పెట్టాలని అడుగులు వేస్తుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ కింద డేటా సెంటర్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నటువంటి హీరానందానీ గ్రూప్‌తో, బైట్‌డ్యాన్స్‌ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. హీరానందానీ గ్రూప్‌ భాగస్వామ్యంతో భారత్‌లోనే డేటా స్టోర్ అయ్యేలా చర్యలు తీసుకొవాలని టిక్‌టాక్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేశీయ యూజర్లకు చెందిన ముఖ్యమైన డేటా భారత్‌ వెలుపల స్టోర్ చేయకూడదు. దీని కారణంగా దేశీయ కంపెనీ అయినటువంటి డేటా సెంటర్ నిర్వహిస్తున్న హీరానందానీ గ్రూప్ ద్వారా భారత్‌లోనే డేటా స్టోరేజ్‌కు ప్రాసెసింగ్ పాలసీలో మార్పులు చేసుకోవాలని టిక్‌టాక్ చూస్తోంది. ఈ చర్చలపై సమాచారం అందినట్లుగా ప్రభుత్వంలోని అధికారులు ధ్రువీకరించారు. 2019లో టిక్‌టాక్‌కు భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. కంపెనీలో దేశీయంగా 2,000 మందికి పైగా ఉద్యోగులు పని చేశారు. ప్రభుత్వం టిక్‌టాక్‌ను నిషేధించిన తరువాత కంపెనీ చాలా మంది ఉద్యోగులను తీసివేసింది. ఇంకొంత మందికి ఇతర బాధ్యతలు అప్పగించింది.

Post a Comment

0 Comments

Close Menu