Ad Code

సరికొత్త ఫీచర్స్‌తో కియా ఈవీ6 కారు విడుదల


కియా ఇండియా ఎలక్ట్రికల్ వెహికల్ ఫీల్డ్ లోకి ప్రవేశించింది. ప్రారంభ ధర రూ.59.95 లక్షలుగా ఈవీ6 అనే కారు విడుదల చేసింది. రెండు వేరియంట్లలో లభించనున్న ఈ మోడల్‌ రూ.59.95 లక్షలు కాగా, మరొకటి రూ.64.95 లక్షలుగా నిర్ణయించారు. ఈ సందర్భంగా కియా ఇండియా ఎండీ, సీఈవో తే-జిన్‌ పార్క్‌ మాట్లాడుతూ విద్యుత్‌ వాహన రంగంలో తమ పరిధిని మరింత విస్తరించడానికి రానున్న రోజుల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నామని అన్నారు. 2025 నాటికల్లా ఇక్కడే తయారైన ఈవీ మోడల్‌ను విడుదల చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కియా అనుబంధ సంస్థయైన కియా కార్పొరేషన్‌ ఈవీ రంగంలో 22.22 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. ఈవీ జర్నీలో భాగంగా పలు రకాల మోడళ్లను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు, వచ్చే ఐదేళ్లలో 14 సరికొత్త మోడల్స్‌ను లాంచ్ చేయాలని సంస్థ సంకల్పించిందని వివరించారు. ప్రస్తుత మోడల్‌కు ఇప్పటికే 355 బుకింగ్‌లు వచ్చాయి. ఈ కియా మోడల్‌ 5.2 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.ఫుల్ గా ఛార్జింగ్ పెట్టినట్లు అయితే 528 కిలోమీటర్లు ప్రయాణించనుంది.350Kwh చార్జర్‌ ఉండటంతో కేవలం 18 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు బ్యాటరీ రీచార్జి అవుతుంది.ఆల్‌-వీల్‌ డ్రైవ్‌ సిస్టమ్‌ కలిగిన ఈ మోడల్‌లో సన్‌రూఫ్‌, మల్టీైప్లె డ్రైవ్‌ మోడ్స్‌, 60 సరికొత్త ఫీచర్స్‌తో తీర్చిదిద్దారు. సేఫ్టీ ప్రమాణాలు మెరుగుపరచడానికి కారుకు 8 ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేశారు.

Post a Comment

0 Comments

Close Menu