టాటా ఎన్ఈయూ పేరుతో కొత్తగా ఒక సూపర్ యాప్ ను ఏప్రిల్ 7న లాంచ్ చేయనున్నది. ఈ యాప్ లాంచ్ కి సంబంధించిన టీజర్ ఫోటోని గూగుల్ ప్లే స్టోర్ పేజీలో కంపెనీ విడుదల చేసింది. ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌తో టాటా Neu సూపర్ యాప్‌ను మొదటిసారి పబ్లిక్‌గా ప్రచారం చేయడం ప్రారంభించింది. ఈ కొత్త యాప్ ముందుగా టాటా గ్రూప్ ఉద్యోగులకు మాత్రమే ఉపయోగించేందుకు పరిమితం చేయబడింది. Tata Neu అనేది అనేక రకాల సర్వీసు యాప్‌ల సమ్మేళనం. ఇది అన్ని రకాల డిజిటల్ సేవలు మరియు యాప్‌లను ఒకే ప్లాట్‌ఫారమ్‌పై తీసుకువస్తుంది. టాటా గ్రూప్స్ గూగుల్ ప్లే స్టోర్ పేజీలో యాప్‌కు సంబంధించి ఒక వివరణను విడుదల చేసింది. దాని యొక్క సారాంశం "అత్యాధునిక డిజిటల్ కంటెంట్‌ని వినియోగించుకోండి, పేమెంట్స్ సులభంగా చేయండి, మీ ఆర్థిక లావాదేవీలను మరింత సులభంగా నిర్వహించండి, మీ నెలవారీ కార్యక్రమాలను సులభంగా ప్లాన్ చేసుకోండి, కొత్త విషయాలను అన్వేషించడానికి చాలా మార్గాలు ఉన్నాయి" అని సంస్థ ప్రకటించింది.Tata Neu యాప్‌ను వినియోగిస్తున్న వినియోగదారులు ఎయిర్ ఆసియా ఇండియా, ఎయిర్ ఇండియాలో విమాన టిక్కెట్‌లను బుక్ చేయడం లేదా తాజ్ గ్రూప్ ప్రాపర్టీలలో హోటల్‌లను త్వరగా బుక్ చేసుకోవచ్చు. బిగ్ బస్కెట్ నుండి కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేయవచ్చు. అలాగే 1mg నుండి మెడికల్ కి సంబందించిన మందులను ఆర్డర్ చేయడం లేదా క్రోమా నుండి ఎలక్ట్రానిక్స్ మరియు వెస్ట్‌సైడ్ నుండి దుస్తులు కొనుగోలు చేయడం వంటి వివిధ టాటా గ్రూప్ డిజిటల్ సేవలు ఈ యాప్ ద్వారా సాధ్యమవుతాయి. వినియోగదారులు ఈ యాప్‌ను ఉపయోగించినందుకుగాను టాటా గ్రూప్ రీడీమ్ చేసుకోగలిగే Neu కాయిన్‌లను కంపెనీ తన వినియోగదారులకు రివార్థుల రూపంలో అందిస్తుంది.
0 Comments