గూగుల్ కాంటాక్ట్ యాప్ ను ఓపెన్ చేసి ఎడమవైపు ఎగువన గల మూడు చుక్కల హాంబర్గర్ మెనుపై నొక్కండి. తరువాత ట్రాష్-ట్రాష్ ఎంపికను ఎంచుకోండి. ఇప్పుడు మీరు గత 30 రోజులలో మీ గూగుల్ అకౌంట్ నుండి తొలగించిన కాంటాక్ట్ ల జాబితా కనిపిస్తుంది. మీ ఫోన్‌లోకి తిరిగి పొందాలనుకునే కాంటాక్ట్ నెంబర్ పై ఎక్కువసేపు నొక్కి ఉంచండి. తరువాత కుడివైపు ఎగువన ఉన్న మూడు చుక్కలపై నొక్కి రికవర్ ఎంపికను ఎంచుకోండి.
వెబ్‌సైట్ ద్వారా గూగుల్ కాంటాక్ట్స్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి ఎడమవైపు ఉన్న మెనులో 'ట్రాష్ - ట్రాష్' ఎంపిక మీద క్లిక్ చేయండి. మీరు మీ ఫోన్‌లో తిరిగి పొందాలనుకునే కాంటాక్ట్ నెంబర్లను ఎంచుకోండి. రికవర్ ఎంపికపై క్లిక్ చేయండి.
iTunes ద్వారా USB కేబుల్ ద్వారా మీ ఫోన్‌ని మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేయండి. ఫోన్‌లో 'ఫైండ్ మై ఐఫోన్'ని ఆఫ్ చేయండి. PCలో iTunes యాప్‌ని ఓపెన్ చేయండి. ఫోన్‌ని కనెక్ట్ చేసిన తర్వాత iTunes యాప్‌లోని ఐఫోన్ చిహ్నంపై క్లిక్ చేయండి. ఇటీవల తొలగించిన కాంటాక్టుని కలిగి ఉన్న బ్యాకప్‌ను ఎంచుకోండి. రికవర్ ఎంపికపై క్లిక్ చేయండి. ఈ ప్రక్రియను పూర్తి అయిన తరువాత ఫోన్ రీబూట్ అవుతుంది.
iCloud ద్వారా ఆపిల్ ID మరియు పాస్‌వర్డ్‌ని నమోదు చేసి iCloud.comకి సైన్ ఇన్ చేయండి. iCloud.com విండో ఎగువన ఉన్న మీ పేరు మీద క్లిక్ చేయండి. అకౌంట్ సెట్టింగ్‌లను క్లిక్ చేయండి. పేజీని దిగువకు స్క్రోల్ చేయండి. తరువాత 'కాంటాక్ట్ రీస్టోర్' ఎంపిక మీద క్లిక్ చేయండి. తిరిగి పొందాలనుకునే కాంటాక్ట్ నెంబర్ ముందు తేదీ పక్కన ఉన్న రికవర్ ఎంపికపై క్లిక్ చేయండి.నిర్ధారించడానికి రికవర్ మీ ద క్లిక్ చేయండి.
0 Comments