ఫార్వర్డ్ సందేశాలను ఒకసారి ఒక గ్రూప్ లేదా వ్యక్తికి మాత్రమే ఫార్వార్డ్ చేసేలా వాట్సాప్ మార్పులు చేస్తోంది. వాట్సాప్ సమాచారాన్ని అందించే డబ్ల్యూఏబీటాఇన్ఫో పోర్టల్ ఈ మేరకు వివరాలు వెల్లడించింది. దాని ప్రకారం.. ''అప్పటికే ఒకసారి ఫార్వార్డ్ అయిన సందేశాన్ని ఒక గ్రూప్‌నకు మించి ఫార్వార్డ్ చేసేందుకు వీలుండదు. ఒకవేళ్ల వినియోగదారులు అలా చేసేందుకు యత్నిస్తే వారు ఒకరికే పంపగలరన్న సందేశం తెరపై వస్తుంది. ఒక గ్రూప్‌నకు మించి పంపాలని వినియోగదారుడు అనుకుంటే సందేశాన్ని మరోసారి సెలక్ట్ చేసి విడిగా ఫార్వార్డ్ చేసుకోవాల్సిందే'' అని డబ్ల్యూఏబీటాఇన్ఫో తెలిపింది. ఈ కొత్త నిబంధనలను ఆండ్రాయిడ్ 2.22.7.2 వెర్షన్‌లోని వాట్సాప్ బీటాలో, ఐఫోన్ 22.7.0.76 వెర్షన్‌లోని వాట్సాప్ బీటాలో సంస్థ ప్రవేశపెట్టిందని పేర్కొంది.
0 Comments