ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌ను మరింత సురక్షితంగా మార్చే లక్ష్యంతో వార్నింగ్ లేబుల్‌ను జోడించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా అభ్యంతరకరంగా పోస్టులు, ఫోటోలు, వీడియోలకు వార్నింగ్ లేబుల్ యాడ్ చేయవచ్చు. ఈ ఫీచర్ ద్వారా అభ్యంతకర ట్వీట్లను సెన్సిటివ్‌గా ఫ్లాగ్ చేయడానికి ట్విట్టర్ అనుమతిస్తుంది. ఇలా పెట్టడం ద్వారా ఆ పోస్టుపై అభ్యంతరాలను ట్విట్టర్‌కు నివేదించవచ్చు. తద్వారా, ట్విట్టర్ ఆ పోస్టును డిలీట్ చేయడం లేదా అలెర్ట్ చేయడం వంటివి చేస్తుంది. అంతేకాదు, మనం చూడబోయే వీడియో లేదా పోస్ట్‌కు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే ముందుగానే తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఈ తరహా ఫీచర్ ఫేస్బుక్ తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ఫేస్బుక్ యూజర్లను తెగ ఆకట్టుకుంటోంది. దీంతో, ఇప్పుడు ఈ ఫీచర్‌ను ట్విట్టర్ సైతం తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్ ట్వీట్‌కు ఫోటో లేదా వీడియోను యాడ్ చేసే సమయంలో.. పైన ఉండే మూడు చుక్కలను క్లిక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే చివర్లో ఫ్లాగ్ ఐకాన్ కనిపిస్తుంది. అందులో న్యూడిటీ (అశ్లీలత), వయోలెన్స్, సెన్సిటివ్ అనే మూడు కేటగిరీలు ఉంటాయి. యూజర్ పోస్ట్ చేసే ఫోటో/ వీడియో పైన పేర్కొన్న మూడు కేటగిరీల్లో దేని కిందికి వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ట్వీట్ చూసే యూజర్లు ఆ పోస్ట్ ఎలాంటిదన్న విషయం ముందుగానే తెలుసుకోవచ్చు. ఒకవేళ, యూజర్ సదరు ఫైల్‌ను చూడాలనుకుంటే దాని మీద కనిపించే షో బటన్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత యూజర్‌కు కంటెంట్ వార్నింగ్ లేబుల్ మెసేజ్ కనిపిస్తుంది. ఈ వార్నింగ్ లేబుల్ ఫీచర్ ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా సున్నితమైన లేదా NSFW ఫోటో లేదా వీడియోపై కంటెంట్ హెచ్చరికను జోడించవచ్చు. వినియోగదారులు ట్విట్టర్లో ఫోటో లేదా వీడియోను ఎడిట్ చేసే క్రమంలో ఫ్లాగ్ సింబల్‌ను నొక్కడం ద్వారా పోస్టుపై ఉన్న అభ్యంతరాన్ని తెలియజేయవచ్చు. యూజర్లు పోస్ట్ చేసే ముందే అది ఏ రకమైన కేటగిరీకి చెందిందో సెలక్ట్ చేసుకోవాలి. తద్వారా పోస్టును ఓపెన్ చేసే యూజర్‌కు సదరు పోస్ట్ దేనికి సంబంధించిందనే విషయంపై క్లారిటీ ఉంటుంది. ఈ ఫీచర్ ఇప్పటికే వెబ్, మొబైల్ యాప్‌లో లైవ్‌లోకి వచ్చింది. అయితే, వార్నింగ్ లేబుల్‌ను ఉపయోగించుకోవడం వినియోగదారు ఇన్‌పుట్‌పై ఆధారపడి ఉంటుంది. దీన్ని కచ్చితంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఆప్షన్ మాత్రమే.
0 Comments