ఒకప్పుడు ఫేస్‌బుక్.. ఇప్పుడు మెటా పేరుతో రీబ్రాండ్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఎన్ని సోషల్ ప్లాట్ ఫాంలు వచ్చినా అతిపెద్ద సోషల్ ప్లాట్ ఫాంగా అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. అలాంటి ఫేస్ బుక్ మెటాకు ఊహించిన దెబ్బ ఎదురైంది. ఫేస్ బుక్ చరిత్రలో మొదటిసారిగా అత్యధిక సంఖ్యలో యూజర్ బేస్ కోల్పోయింది. దాదాపు ఒక మిలియన్‌కుపైగా యూజర్లను కోల్పోయింది. సంస్థ నాల్గోవ క్వార్టర్ కి సంబంధించి ఫేస్ బుక్ విడుదల చేసిన అంచనాల్లో ఆశించిన లాభాలకు భారీ కోత పడింది. Meta సంస్థ తన స్టాక్ విలువలో భారీగా తగ్గుదల కనిపించింది. దాదాపు 20శాతం మేర స్టాక్ విలువ క్షీణించింది. మార్కెట్ విలువలో దాని విలువ 200 బిలియన్ డాలర్లు వరకు తగ్గింది. అంతేకాదు.. డెయిలీ ఫేస్ బుక్ యూజర్ల సంఖ్య కూడా భారీగా తగ్గిపోతున్న విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఫేస్ బుక్ ప్లాట్ ఫాం ఎంత పెద్ద సోషల్ ఫ్లాట్ ఫాం అందరికి తెలిసిందే.. మిలియన్ల మంది యూజర్లు క్రమంగా తగ్గిపోతున్నారే విషయం బయటకు పొక్కిన నేపథ్యంలో ఫేస్‌బుక్ మరిన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయా? అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సంస్థ కూడా ఇదే విషయంలో లోతుగా విశ్లేషణ చేసుకుంటుందనే ఊహాగానాలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తమ ప్లాట్ ఫాంపై 1.95 బిలియన్ల మంది డెయిలీ యూజర్లు ఉన్నట్టుగా గత త్రైమాసికం ఫలితాల్లో ఫేస్‌బుక్ ప్రకటించింది. Q4 అంచనాల్లో యూజర్ల సంఖ్య 1.95 బిలియన్లుగా ఫేస్‌బుక్ వెల్లడించింది. సుమారు 2 మిలియన్ల మంది డెయిలీ యూజర్లను ఫేస్‌బుక్ కోల్పోయింది. ఈ ఏడాది త్రైమాసికంలో మాత్రం 33.67 బిలియన్ల టర్నోవర్‌పై 10 బిలియన్లు (రూ.77,106 కోట్లు) లాభం రానున్నట్టు సోషల్ దిగ్గజం పేర్కొంది. కానీ, Q3 లాభాలతో పోల్చితే ఈసారి Q4 లాభాల 8 శాతం వరకు తగ్గినట్టు తేలింది. ఇతర సోషల్ ప్లాట్ ఫాంలైన TikTok, ప్రపంచ ఐటీ దిగ్గజం Apple ప్రైవసీ విధానాలతో పోటీదారుల నుంచి మెటాకు తీవ్ర పోటీ నెలకొంది. ఈ పోటీ వాతావరణంలో ప్రత్యరులకు పోటీగా రాణించేందుకు మెటా సుదీర్ఘ ప్రయత్నాలు చేస్తోంది. ఫేస్‌బుక్ యూజర్లలో ఎక్కువగా ఉత్తర అమెరికాలో Meta డెయిలీ రోజువారీ వినియోగదారులను ఒక మిలియన్ కు పైగా కోల్పోయింది. మరోవైపు అడ్వర్టైజ్ మెంట్ ప్రకటన వృద్ధిలోనూ భారీగా తగ్గుదల కనిపించింది. ఈ ప్రాంతంలో ప్రకటనల ద్వారా కంపెనీ అత్యధికంగా డబ్బు సంపాదించింది. Facebook రోజువారీ యాక్టివ్ యూజర్లు 2020 నాల్గవ త్రైమాసికంలో 1.93 బిలియన్ల నుంచి గత త్రైమాసికంలో 1.92 బిలియన్లకు చేరుకున్నారు. ఈ క్షీణత కారణంగానే గ్లోబల్ మార్కెట్‌లో Facebook డెయిలీ యూజర్ల సంఖ్యను మరింత తగ్గించింది, ఇది కంపెనీ చరిత్రలోనే మొదటిసారిగా కంపెనీ ప్రతినిధి ధృవీకరించారు. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెటా ఇతర అనుబంధ ప్లాట్‌ఫారమ్‌లు కూడా నెమ్మదిగా యూజర్ల వృద్ధిని సాధించాయి, Q3 2021 నుంచి Q4 2021 వరకు కేవలం 10 మిలియన్ల మంది యూజర్లు మాత్రమే చేరారు. సోషల్ మీడియా మార్కెట్లో Meta Facebook మార్కెట్ లీడర్‌గా వ్యవహరిస్తోంది. 2004లో ప్రారంభమైన ఈ ఫేస్‌బుక్ అప్పటినుంచి యూజర్ బేస్ ఎంగేజ్ మెంట్ భారీ స్థాయిలో పెరుగుతూ వచ్చింది. అప్పటినుంచి తిరుగులేని అగ్రగామిగా ఎదిగింది ఫేస్ బుక్.. అయినప్పటికీ, Facebook అనేక వివాదాల్లో చిక్కుకుంది. కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణం లేదా యూజర్ ప్రైవసీ సంబంధించిన సమస్యలు అప్పట్లో ఫేస్‌బుక్‌ను చుట్టుముట్టాయి. గత ఏడాదిలో యాహూ ఫైనాన్స్ సర్వే నిర్వహించగా.. అందులో ఫేస్‌బుక్ దిగువ స్థాయి కంపెనీగా నిలిచింది. అప్పుడే ఫేస్ బుక్ తమ కంపెనీని రీబ్రాండింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అది కంపెనీ సంబంధిత సమస్యలను పరిష్కరం దొరకుతుందని భావించింది. అదే మెటాకు లాభదాయకమైన వ్యాపారంగా మారింది. ఎందుకంటే.. 2021లోనే దాదాపు 40 బిలియన్ల డాలర్ల లాభాన్ని ఆర్జించింది. అది కూడా ఎక్కువగా యాడ్స్ నుంచే భారీగా ఆదాయం వచ్చింది. అయితే.. రియాలిటీ ల్యాబ్స్ ప్రాజెక్ట్‌ల కోసం.. గత ఏడాది 10.2 బిలియన్ల డాలర్లను కోల్పోయింది. Facebook ప్రధాన సమస్యలను సాధ్యమైనంత తొందరగా Meta పరిష్కరించలేకపోతే.. సోషల్ ప్లాట్‌ఫారమ్ మార్కెట్ విలువలో భారీ క్షీణతను చూస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో ఎక్కువ మంది యూజర్లను కోల్పోతుందని భావిస్తున్నారు. అయితే కంపెనీ మొదటి త్రైమాసిక ఆదాయాన్ని27 బిలియన్ డాలర్ల నుంచి 29 బిలియన్ల డాలర్ల మధ్య అంచనా వేస్తోంది. ఒక్కరకంగా చెప్పాలంటే ఇది తక్కువ అంచనగానే చెప్పాలి. రానున్న రోజుల్లో మెటా తమ యూజర్ బేస్ తగ్గిపోకుండా ఉండేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందో చూడాలంటారు మార్కెట్ విశ్లేషకులు.
0 Comments