Ad Code

బిఎస్ఎన్ఎల్ కు మీ నంబర్ పోర్ట్ చేయాలా?


టెలికం కంపెనీలు ఒకేసారి ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచేశాయి. ప్రైవేట్ యాజమాన్య టెలికం సంస్థలైన ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మరియు జియో లు అన్ని కూడా వాటి రీఛార్జ్ రేట్లను హైక్ చేశారు. ప్రతి కంపెనీ కూడా వారి ప్లాన్స్ ధరలను 20 నుండి 25 శాతం వరకూ పెంచడంతో వినియోగదారులకు రీఛార్జ్ కష్టాలు మొదలయ్యాయి. అందుకే, వినియోగధారులు కూడా ప్రత్యామ్న్యాల కోసం చూస్తున్నారు. అయితే, ఇప్పుడు అందరికి కనిపిస్తున్న ఏకైక మార్గంగా బిఎస్ఎన్ఎల్ కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ ప్రభుత్వ టెలికం సంస్థ ఇప్పటికి కూడా తక్కువ ధరకే తన రీఛార్జ్ ప్లాన్స్ ను అఫర్ చేస్తుండటమే కారణం. అందుకే కాబోలు 'How To Port My Mobile Number To BSNL' అనేది ఎక్కువగా సెర్చ్ చేస్తున్న విషయంగా చెబుతున్నారు. మరి ఇదే విషయం గురించి మీరు కూడా తెలుసుకోవాలని చూస్తున్నట్లయితే ఈ క్రింద సూచించిన విధంగా చేయండి. ఇలా చేస్తే ఒక వారం లోపలే మీ మొబైల్ నంబర్ ను బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ చేసుకోవచ్చు. మీరు పోర్ట్ చేయదలచిన SIM కార్డు నుండి 1900 కి PORT అని టైప్ చేసి కొంచెం స్పెస్ ఇచ్చి మీ మొబైల్ నంబర్ ను టైప్ చేసే పంపించాలి. అంటే, PORT 0123456789 ఈ ఫార్ మ్యాట్ లో 1900 కి మెసేజ్ పంపించాలి. తరువాత, మీరు ఎంటర్ చేసి పంపిన మోబైల్ నంబర్ కు మెసేజ్ వస్తుంది. అదే, UPC Code (యూనిక్ పోర్టింగ్ కోడ్) వస్తుంది. తరువాత, మీకు వచ్చిన పోర్టింగ్ నంబర్ ను మీ దగ్గరలోని బిఎస్ఎన్ఎల్ సెంటర్ లేదా SIM స్టోర్లో చూపిస్తే అక్కడ మీకు కొత్త SIM ను ఇస్తారు. దీనికోసం మీరు మీ ప్రూఫ్ జిరాక్స్ ను సమర్పింఛాయాల్సి ఉంటుంది. ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ వంటి ప్రభుత్వ అనుమతి పొందిన పత్రాలలో దేనినైనా మీరు ఇవ్వవచ్చు. మీరు వివరాలు అందించిన తరువాత రెండు లేదా మూడు రోజుల్లో మీ నంబర్ పాత నెట్వర్క్ నుండి డీ-యాక్టివేట్ అవుంతుంది మరియు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లోకి యాక్టివేట్ చేయబడుతుంది. తరువాత, మీరు మీ అవసరానికి అనువైన బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ను ఎంచుకుని రీఛార్జ్ చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu