దేశంలో మొబైల్ నెట్‌వర్క్ సేవలతో సహా డైరెక్ట్-టు-హోమ్ (DTH), బ్రాడ్‌బ్యాండ్ వంటి అనేక రకాల సేవలను భారతీ ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ అందిస్తుంది. ఈ సంస్థ అందించే సర్వీస్ రకంతో సంబంధం లేకుండా స్థిరమైన మరియు నాణ్యమైన సర్వీస్ ప్రొవైడర్‌గా స్థిరపడింది. శాటిలైట్ టీవీ సేవల అందించేటప్పుడు ఎయిర్‌టెల్ యొక్క DTH సర్వీస్ మిగిలిన వారితో పోలిస్తే అగ్రస్థానంలో ఉంది. భారతీ ఎయిర్‌టెల్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఆండ్రాయిడ్ బాక్స్ లలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఒకటి. ఇది ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్ మరియు ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలను వినియోగదారులకు అందించబడుతుంది. యాప్‌లోని కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులు SonyLIV, Lionsgate Play మరియు మరిన్నింటి స్వతంత్ర ప్లాట్‌ఫారమ్‌లకు సభ్యత్వాలను కొనుగోలు చేయాలి లేదా వినియోగదారులు Airtel Xstream ప్రీమియం ప్లాన్‌కు వెళ్లవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ప్లాన్ టాటా స్కై బింగే వలె బండిల్ చేయబడిన OTT సర్వీస్. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ప్లాన్‌తో వినియోగదారులు 12 విభిన్న కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందువచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ప్లాన్ రెండు వేర్వేరు ధరలలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. వినియోగదారులు నెలవారీ ఎంపికకు ఎంచుకుంటే కనుక దీనిని రూ.149 ధర వద్ద పొందవచ్చు. అలాగే వార్షిక ఎంపిక విధానాన్ని ఎంచుకుంటే కనుక దీనిని రూ.1499 ధర వద్ద పొందవచ్చు. వినియోగదారులు వార్షిక ప్లాన్‌ను ఎంచుకుంటే కనుక వారికి నెలవారీ ధర రూ. 125కి తగ్గుతుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంతో వినియోగదారులు Eros Now, SonyLIV, Hoichoi, ShemarooMe, Lionsgate Play, Ultra, EpicON, Manorama Max, Divo, Dollywood Play, KLIKK మరియు NammaFlix వంటి OTT కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్ ను అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లలో చాలా వరకు బాగా ప్రాచుర్యం పొందనప్పటికీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధర కూడా చాలా ఎక్కువగా లేదు. మీరు బండిల్ చేయబడిన సబ్‌స్క్రిప్షన్‌కు వెళ్లకూడదనుకుంటే మీరు ఎల్లప్పుడూ ఈ ప్లాట్‌ఫారమ్‌లకు స్వతంత్ర సభ్యత్వం కోసం కూడా వెళ్లవచ్చు. Airtel Xstream వినియోగదారులకు దాని ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న ప్లాట్‌ఫారమ్‌ల జాబితాను అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాట్‌ఫారమ్‌లకు స్వతంత్ర సభ్యత్వాన్ని కొనుగోలు చేయడానికి వారిని అనుమతిస్తుంది. చాలా సందర్భాలలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ప్లాన్‌ను కొనుగోలు చేయడం ఆర్థికంగా అందుబాటులో ఉన్నందున మరింత అర్థవంతంగా ఉంటుంది. ఉదాహరణకు SonyLIV యొక్క నెలవారీ ధర రూ.299 అయితే Xstream ప్రీమియం ప్లాన్ సగానికి సగం ధరకే నెలకు రూ.149 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇందులో SonyLIV కూడా ఉంటుంది. Lionsgate Play యొక్క స్వతంత్ర సబ్‌స్క్రిప్షన్ ధర కూడా నెలకు రూ.149 కానీ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ప్లాన్‌తో వినియోగదారులు అదే రూ.149 చెల్లించి మరిన్ని ప్లాట్‌ఫారమ్‌లకు సభ్యత్వాన్ని పొందవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ అనేది ఆండ్రాయిడ్ ఎస్‌టిబి కాబట్టి వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి 5 వేలకు పైగా అప్లికేషన్‌లను సౌకర్యవంతంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనుమతిని ఇస్తుంది. ఈ ఎస్‌టిబి గూగుల్ అసిస్టెంట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది వినియోగదారులకు టివికి వాయిస్ కమాండ్‌లను ఇవ్వడానికి అనుమతిస్తుంది. ఈ STB గురించి ఉత్తమమైన విషయాలలో ఒకటి ఇది 4K కంటెంట్‌కు మద్దతు ఇవ్వగలదు. కాబట్టి మీకు ఇష్టమైన ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌ల నుండి మీకు ఇష్టమైన షోలను నేరుగా టీవీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ప్రస్తుతం భారతదేశంలో రూ.2,499 ధరకి అందుబాటులో ఉంది. ఇది డిస్కౌంట్ ధర అని మరియు వినియోగదారులు ఈ రోజు రూ.2,499 కి కొనుగోలు చేస్తుంటే రూ .1101 ఆదా చేస్తున్నారని కంపెనీ చెబుతోంది. భారతీ ఎయిర్‌టెల్ నుండి ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ అసలు ధర రూ.3,600. స్మార్ట్ టీవీని కలిగి లేని మరియు దాని పైన పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడని ఎవరికైనా ఇది మంచి STB. ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఏదైనా సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చగలదు.
0 Comments